తిరుమల, జూలై 27, (
ఉదయ కిరణాలు) :తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు అలంకార ప్రియుడు. వెలకట్టలేని ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు వెంకన్న సొంతం. సామాన్యుడి నుంచి సంపన్నుడి దాకా రాజులు, చక్రవర్తులు, నవాబులు, బ్రిటిష్ పాలకులు, మహంతులు, ప్రభువులు, ప్రజాప్రతినిధులు ఇలా ఎందరో విరాళాలు, కానుకలుగా సమర్పించిన విలువైన బంగారు ఆభరణాలు వెలకట్ట లేనివి. టీటీడీ రికార్డుల ప్రకారం ఖజానాలో ఉన్న ఖరీదైన ఆభరణాల బరువు 11 టన్నులు. ఈ పసిడిని టీటీడీ పలు బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. రూ. 17 వేల కోట్ల విలువైన నగదు డిపాజిట్ల రూపంలో వెంకన్న ఖాతాలో టీటీడీ పెట్టింది. 10 టన్నుల వెండి ఉండగా 11 టన్నుల బంగారం బ్యాంకుల్లో టీటీడీ డిపాజిట్ చేసింది.ఈ మధ్య వారణాసిలో జరిగిన అంతర్జాతీయ సదస్సులో టీటీడీ ఈవో ధర్మారెడ్డి కూడా వెంకన్న ఆస్తుల లెక్కల వివరాలను వివరించారు.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య రోజుకు దాదాపు లక్ష మందికి చేరుకోవడంతో ఆదాయం కూడా టీటీడీకి అదే నిష్పత్తిలో పెరిగింది. హుండీ కానుకలు, తలనీలాలు వివిధ సేవలు, దర్శనాలకు సంబంధించిన టిక్కెట్ల విక్రయం, ప్రసాదాల విక్రయం, గదుల కేటాయింపు, విరాళాలు మొదలైన వాటి ద్వారా టీటీడీ ఆదాయాన్ని పొందుతుంది. ఆస్తుల వివరాలతో పాటు టీటీడీకి చెందిన పలు విషయాలను వారణాసి సదస్సులో వెల్లడిరచింది.దేశవ్యాప్తంగా టీటీడీ 71 ఆలయాలను నిర్వహిస్తోందని, శ్రీవారికి అలంకరించే బంగారు ఆభరణాలు 1.2 టన్నుల కేజీలు ఉన్నట్లు తెలిపిన టీటీడీ, వెండి 10 టన్నుల మేర ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటిదాకా రూ.17 వేల కోట్లను వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసిన టీటీడి 11 టన్నుల బంగారాన్ని డిపాజిట్ చేసినట్లు స్పష్టం చేసింది. అలాగే తిరుమలేశుని అలంకరణకు ఏడాదికి 500 టన్నుల పుష్పాలను వినియోగిస్తోంది. ప్రస్తుతం 24500 మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నట్లు టీటీడీ పేర్కొంది. ఆలయంలో భక్తులకు సేవలందించేందుకు రోజుకు 800 మంది ఉద్యోగులు విధుల్లో ఉంటారని పేర్కొంది. శ్రీవారి ఆలయంలో ప్రసాదాల తయారీకి ఏడాదికి 5వేల టన్నుల నెయ్యిని వినియోగిస్తున్న విషయాన్ని టీటీడీ వెల్లడిరచింది. టీటీడీ పరిధిలో 6వేల ఏకరాల అటవీ ప్రాంతం ఉందన్న విషయాన్ని కూడా టీటీడీ ఆస్తుల చిట్టాలో పేర్కొంది.
0 కామెంట్‌లు