Hot Posts

6/recent/ticker-posts

జన రమణీయునికి జన్మదిన అభినందన

అభిమానుల మధ్య వైభవంగా రమణా చారి పుట్టిన రోజు వేడుకలు 




హైదరాబాద్, ఫిబ్రవరి 8 (ఉదయకిరణాలు)  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి డా. కె. వి. రమణా చారి గారి  జన్మదినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి.మాసాబ్ టాంక్ దగ్గరలోని ఆయన నివాసంలో అభిమానులు, కళాకారులు,వివిధ శాఖల ఉద్యోగులు అధికారులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక అభినందనలు నడుమ పుట్టిన రోజు వేడుకలు కొనసాగాయి. అభిమానులకు ఆయనను పూల వర్షాలతో స్వాగతం పలుకుతూ వేడుకలు ప్రారంభించారు. ఈ సందర్బంగా డా కెవి రమణా చారి గారు మాట్లాడుతూ అభిమానులు తనపై చూపిస్తున్న ఆదరాభిమానాలకు మరింత కాలం ఆయురారోగ్యాలతో ఉండేటట్లు దీవెనలు పొందినట్లేనని కొనియాడారు. కరోనా దృష్ట్యా ఎక్కువగా అభిమానులను రావద్దని చెప్పినా వినని అభిమానులకు జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచనలు చేశారు. కరోనాతో ఇబ్బందులు పడుతున్న వారికి దాని గురుంచి తెలుసునని ఇంతటి భయంకర వైరస్ లు ఉన్నప్పుడు జాగ్రత్తగా మెలగాలని అభిమానులను కోరారు. అనంతరం అభిమానుల మధ్య కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు.  








కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు