Hot Posts

6/recent/ticker-posts

ఢిల్లీ రైతుల ఆందోళనకు మద్దత

  రేపు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోకు పిలుపు

(ఫైల్ ఫోటో)
    అమరావతి,ఫిబ్రవరి5(ఉదయకిరణాలు):           
   ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనలు     
   కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా 
   ఆలిండియా కిసాన్‌ సంఘర్ష్‌ కో`ఆర్డినేషన్‌ కమిటీ  
   ఈ నెల 6న రోడ్ల దిగ్బంధానికి పిలుపునిచ్చింది.  
   ఈ నిర్ణయం మేరకు రాష్ట్రవ్యాప్తంగా  
   రాస్తారోకోలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు  
   సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌ వడ్డే 
   శోభనాద్రీశ్వరరావు  ఒక ప్రకటనలో 
   పిలుపు నిచ్చారు. రైతు వ్యతిరేక నల్ల చట్టాలను       రద్దు చేసేవరకూ దశల వారీగా పోరాటాలు  చేయాలన్నారు. ఢిల్లీలో రైతు ఆందోళన చేస్తున్న ప్రాంతాల్లో తాగునీరు, కరెంటు బంద్‌ చేశారన్నారు. రోడ్లపై మేకులు  కొట్టి ప్రయాణానికి ఆటంకం కలిగిస్తున్నారన్నారు. 40 మంది రైతు సంఘాల నాయకులపై అక్రమ కేసులు  పెట్టారని, అడుగడుగునా ఉద్యమానికి తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. అనుకూలమైన వాతావరణం కల్పించకుండా నిర్బంధాన్ని ప్రయోగిస్తూ చర్చకు రమ్మని ఆహ్వానించడం దుర్మార్గమన్నారు. ఇది రైతాంగాన్ని అవమానించడమేనన్నారు. రైతు ఉద్యమం పట్ల కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా ఈ నెల  6న జరిగే రాస్తారోకోలో రైతుతోపాటు కమిటీలో ఉన్న భాగస్వామ్య సంఘాలు, కార్మిక, విద్యార్ధి, యువజన, మహిళ, దళిత, గిరిజన, చేతివృత్తిదారుల  సంఘాలు  పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు