Hot Posts

6/recent/ticker-posts

సైన్సు టీచర్ల కోసం ప్రత్యేక సెమినార్

హైదరాబాద్, ఫిబ్రవరి 3 (ఉదయకిరణాలు) : ఫిబ్రవరి 28 వ తేదీ జాతీయ సైన్సు దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర విద్యా పరిశోధనా శిక్షణ మండలి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్ ను నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా విద్యాధికారిణి  ఆర్. రోహిణీ పేర్కొన్నారు. జిల్లాలోని పాఠశాలల ఉపాధ్యాయులు ఎవరైనా ఈ సెమినార్ లో భాగం పంచుకోవచ్చని పిలుపునిచ్చారు. ఆత్మ నిర్భర్ భారత్,తరగతి గదిలో, బయట టీచర్ల పాత్ర, జాతీయ విద్యా విధానం -2020, సైన్సు విద్య విజయవంతానికి తీసుకోవాల్సిన మార్గదర్శకాలు,రూపకల్పన,సైన్సు చిత్ర పటాలు,బొమ్మలు ఇతర అంశాలతో కూడిన సెమినార్ ను నిర్వహించనున్నట్లు విద్యాధికారిణి రోహిణి తెలిపారు. జిల్లాలోని పాఠశాలల ఉపాద్యాయులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంశాల వారీగా ఆసక్తి కలిగిన టీచర్లు ఫిబ్రవరి 8 వ తేదీ లోపల  tgscertmathsscience@gmail.com కు మెయిల్ పంపాలని కోరారు. మరిన్ని వివరాల కోసం హైదరాబాద్ జిల్లా సైన్సు అధికారి ధర్మేంద్ర రావు ఫోన్ నెంబర్ 8309468801,7799171277,లను సంప్రదించవలసినదిగా తెలిపారు.    

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు