అనుకున్నట్టుగానే వైద్య రంగానికి పెరిగిన కేటాయింపు
బడ్జెట్‌లో పేలిన పెట్రో బాంబ్
ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు తాయిలాలు
కాలం తీరిన వాహనాలను తుక్కుగా మార్చేలా పథకం..
న్యూఢిల్లీ,ఫిబ్రవరి1(ఉదయ కిరణాలు)
: డిజిటల్ పద్ధతిలో బ్జడెట్ ప్రవేశపెట్టిన నిర్మల.. గంటా 51 నిముషాల పాటు ప్రసంగించారు. బడ్జెట్ మూలధన వ్యయం రూ.5.54 లక్ష కోట్లుగా ఆమె పేర్కొన్నారు. 2021`22 ద్రవ్యలోటు లక్ష్యం 6.8 శాతంగా ఉండనుందనే అంచనాలను వెల్లడించారు. 2025`26 నాటికి ద్రవ్యలోటు లక్ష్యం 4.5 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. 2022లో రూ.12 లక్ష కోట్ల అప్పు తేవాలని నిర్ణయించినట్టు ఆర్థికమంత్రి చెప్పుకొచ్చారు. అయితే ఆదాయ పన్నుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో 2021`22 బ్జడెట్‌పై భారీ ఆశలు పెట్టుకున్న మధ్యతరగతి ఉద్యోగులకు నిరాశే మిగిలింది. నిర్మలా సీతారామన్ ప్రసంగం అనంతరం లోక్‌సభ రేపటికి వాయిదా పడిరది. కరోనా నేపథ్యంలో అనుకున్నట్లుగానే వైద్య రంగానికి కేటాయింపు పెంచారు. ఎన్నికలు జరుగనున్న బెంగాల్, తమిళనాడు,కేరళ లాంటి రాష్ట్రాలకు తాయిలాలు ప్రకటించారు. వయోవృద్దులయిన 75 ఏళ్లకు పైబడిన వారికి ఐటి రిటర్న్స్ నుంచి మినహాయింపు నిచ్చారు. పన్ను చెల్లింపుదారులకు మాత్రం ఎలాంటి వెసులుబాటు కల్పించలేదు. ఈ సందర్భంగా కేంద్రం బ్జడెట్ యాప్‌ను విడుదల చేసింది. ఇక విపక్షాల నిరసన మధ్య బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభించిన నిర్మలా సీతారామన్... కరోనా లాక్‌డౌన్ దెబ్బకు కుంటుపడిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ఎన్డీయే సర్కారు తీసుకున్న చర్య గురించి వివరించారు. అనేక సంక్షోభాలను ఎదుర్కొని ఆర్థిక వ్యవస్థను బాగుచేశాం. లాక్‌డౌన్ సందర్భంగా లక్షలాది మందికి ఉచితంగా ధాన్యం పంపిణీ చేశాం. ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీ ప్రకటించాం. 80 మిలియన్ల జనాభాకు ఉచిత గ్యాస్ అందజేశామని పేర్కొన్నారు. అదే విధంగా... కరోనా కట్టడికి రెండు వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. మరో రెండు వ్యాక్సిన్లు భారత్‌తో పాటు ఇతర దేశాలకు వాక్సిన్ల డోసు ఎగుమతి చేస్తున్నామని ప్రకటించారు. వందదేశాలకు మనం కరోనా టీకాను సరఫరా చేస్తున్నాం. కరోనా కేసులను కట్టడి చేయడంతో దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టగలిగాం. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే అన్ని అంశాలను బ్జడెట్‌లో పొందుపరిచామని తెలిపారు. స్థూల మార్కెట్ రుణాల లక్ష్యం రూ. 12 లక్షల కోట్లుగా చెప్పారు. అలాగే 5వ ఆర్థిక సంఘం సిఫార్సుకు కేంద్రం ఆమోదం చెబుతూ.. పన్నుల్లో రాష్ట్రాలకు 41 శాతం వాటాగా ప్రకటించారు. ఇక గతంలో ఎన్నడూ లేని పరిస్థితుల్లో బ్జడెట్ ప్రవేశపెడుతున్నామన్న ఆర్థిక మంత్రి.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఈ బడ్జెట్ కొత్త ఊతం ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇక కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. గతేడాది లాక్‌డౌన్ అమలు చేయాలన్న నిర్ణయం కఠినమైనదేనన్న నిర్మలా సీతారామన్... లాక్‌డౌన్ విధించకపోతే మరింత ఘోరమైన పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు.
కరోనా సంక్షోభం నేపథ్యంలో.. ఆరేళ్ల కాలానికి గానూ 64,180 కోట్లతో ఆత్మనిర్భర్ హెల్త్ యోజన ప్రకటించిన ఆర్థిక మంత్రి.. దేశవ్యాప్తంగా 15 హెల్త్ ఎమర్జెన్సీ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బడ్జెట్‌లో అనేక రంగాలకు భారీమొత్తంలో కేటాయింపు జరిపారు. జల్ జీవన్ మిషన్ కోసం రూ.2.87 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. వైద్య ఆరోగ్యం కోసం రూ.2.23 లక్షల కోట్లు కేటాయించారు. వాయు కాలుష్యం నివారణ కోసం 42సెంటర్లకు రూ.2,217 కోట్లు కేటాయించారు.మెగా ఇన్వెస్ట్‌మెంట్ టెక్స్‌టైల్ పార్క్‌లు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మూడేళ్లలో 7పార్కు ఏర్పాటు చేస్తామని హావిూ ఇచ్చారు. మెట్రో రైల్ నెట్‌వర్క్ మరింత విస్తరిస్తున్నామని తెలిపారు. మెట్రో రైల్ అభివృద్ధి కోసం పీపీపీ విధానాన్ని అవలంబిస్తున్నామని తెలిపారు. బెంగాల్‌లో రూ.25వేల కోట్లతో 675 కి.విూ. రోడ్లు నిర్మించామని తెలిపారు. కొచ్చి మెట్రో రైల్ ఫేజ్`2కు 1,957 కోట్లు, చెన్నై మెట్రో రైల్ ఫేజ్‌కు .5,300 కోట్లు, బెంగళూరు మెట్రో రైల్ ఫేజ్`2కు .14,788 కోట్లు, నాగ్‌పూర్ మెట్రో రైల్ ఫేజ్`2కు .5,976 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. ప్రజా రవాణా కోసం కొత్తగా రూ.18 వేల కోట్లతో బస్సు కొనుగోలు చేస్తున్నామని నిర్మల ప్రకటించారు. 9 షిప్ రీసైక్లింగ్ యూనిట్ ద్వారా లాభాు వస్తున్నాయని, భారీగా విదేశీ మారకం దేశంలో ప్రవేశిస్తోందని తెలిపారు. ఇకపోతే పన్ను చెల్లించేవారిపై ఈ బ్జడెట్ నీళ్లు చల్లింది. వారికి ఎలాంటి మినహాయింపులూ ప్రకటించలేదు. ఆదాయపన్ను శ్లాబుల్లో కేంద్రం ఎలాంటి మార్పులూ చేయలేదు. దీంతో పన్ను చెల్లింపుదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మధ్య తరగతి ప్రజలు ఎంతైతో ఆశలు పెట్టుకున్నారో... అవన్నీ నిరాశయ్యాయి. మరోవైపు 75 ఏళ్లు దాటిన వారికి మాత్రం కేంద్రం భారీ ఊరటనిచ్చింది. 75 ఏళ్లు దాటినవారు ఆదాయపన్ను రిటర్న్స్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అలాగే చిన్న పన్ను చెల్లింపుదారులకు వివాద పరిష్కార కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బడ్జెడెట్‌లో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీకి రూ.35 వేల కోట్లు ప్రకటించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా ఆమె స్పష్టం చేశారు. ఇప్పటికే రెండు వ్యాక్సిన్లు వినియోగంలోకి వచ్చాయని, మరిన్ని వ్యాక్సిన్లు రానున్నట్లు ఆమె వెల్లడించారు. వినియోగంలో ఉన్న రెండు వ్యాక్సిన్లను మరో 100 దేశాలకు సరఫరా చేస్తున్నట్లు కూడా చెప్పారు. ఆరోగ్యం, సంరక్షణకు 2021`22లో రూ.2.23 లక్షల కోట్లు కేటాయించినట్లు నిర్మ తెలిపారు. ఇది గతేడాది కంటే 137 శాతం ఎక్కువని చెప్పారు.
0 కామెంట్‌లు