Hot Posts

6/recent/ticker-posts

ఈ రోజు రాశిఫలాలు 07 ఫిబ్రవరి 2021 ఆదివారము



॥శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం 

 ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే॥

           || ఓమ్ శ్రీ మహాగణాధి పతయే నమః ||

                          శ్లోకం 

|| జయాయ జయభద్రాయ హర్యశ్వాయ నమో నమః   నమో నమ స్సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః ||

                        తాత్పర్యం :                       

ఎదురులేని పరాక్రమము గల ఓ దేవా!నీకు నమస్కారము. విజయం మంగళం ప్రసాదించే నీకు నమస్కారము. పచ్చని గుఱ్ఱములు గల నీకు నమస్కారము.  సహస్ర కిరణాలు గల నీకు నమస్కారము. అదితి పుత్రుడవయిన నీకు నమస్కారము. 

మేషం


అశ్వని1,2,3,4,భరణి 1,2,3,4, కృతిక 1,

విదేశీ వ్యవహారాల రంగాలకు చెందిన వారికి ఆర్థికంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారంలో నిలదొక్కుకోవడానికి మరింత శ్రమించవలసి ఉంటుంది. స్త్రీలకు ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. ఇంటా బయటా ప్రశాంతం నెలకొంటుంది.చేపట్టిన వ్యవహారాలలో స్వల్ప అవరోధాలు ఉంటాయి కొత్త రుణాలు చేయవలసి రావచ్చు. ఇంటాబయటా చికాకులు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు అభివృద్ధి కి ఆటంకాలు కలుగుతాయి.సహోద్యోగులతో మాట ఇబ్బందులుంటాయి ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.  

మీకు సంపూర్ణమైన ఫలితాలు తెలుసుకోవాలని ఆసక్తి మీకుంటే మీ పుట్టిన తేది ఆధారంగా వ్యక్తిగత జాతక పరిశీలనను అనుభవజులైన మాలాంటివారివారిని గురుజిలను సంప్రదించి వారి ద్వారా మీ జాతక చక్రం వేయించుకుని విషయం తెలుసుకుని తగిన రెమిడిలను ఆచరిస్తే ఫలితాలు అనుకూలంగా అనుభవంలోకి వస్తాయి. 

వృషభం

కృతిక 2,3,4,రోహిణి 1,2,3,4, మృగశిర1,2,

 మీ యత్నాలకు జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. స్త్రీలకు అర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఇతరులకు పెద్ద మొత్తాలలో ధన సహాయం చేయడం మంచిదికాదు అని గమనించండి. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది.నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది ప్రయాణాలలో నూతనపరిచయాలు ఉంటాయి.దాయాదుల తో స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకొంటారు. చిన్ననాటి మిత్రులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపార ఉద్యోగాలలో మరింత ఉత్సాహంగా పనిచేస్తారు. 

మిథునం

మృగశిర 3,4, ఆరుద్ర 1,2,3,4, పున్వరసు1,2,3,

ఆర్థిక వ్యవహారాలు గోప్యంగా ఉంచడం క్షేమదాయకం. కుటుంబ సభ్యుల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగాలయందు ఆశించిన ఆదాయం లభిస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలలో చికాకులు తప్పవు. ఏజెంట్లు, బ్రోకర్లకు ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు.దీర్ఘకాలికంగా రావలసిన బాకీలు వసూలవుతాయి కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరంగా అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగమున అనుకూలత పెరుగుతుంది. 


కర్కాటకం

పున్వరసు 4,పుష్యమి 1,2,3,4, అశ్లేష 1,2,3,4,

బ్యాంకు వ్యవహారాలలో అచిరిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. భార్యాభర్తల మధ్య అవగాహనాలోపం అధికమవుతుంది. బంధుమిత్రుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. స్త్రీల సృజనాత్మకతకు తగిన గుర్తింపు, రాణింపు లభించగలదు. ఇతరుల విషయంలో తలదూర్చి ఇబ్బందులకు గురికాకండి.ఋణఒత్తిడి పెరుగుతుంది కొత్త రుణాలు చేయవలసి రావచ్చు. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కావు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. వ్యాపారాలు స్వల్ప లాభాలు ఉంటాయి ఉద్యోగమున వాదనలకు వెళ్లకపోవడం ఉత్తమం.  

సింహం

మఘ 1,2,3,4, పుబ్భ 1,2,3,4, ఉత్తర1,

వ్యాపారులకు శుభదాయకం. మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటంతో ఒకింత నిరుత్సాహం చెందుతారు.సంఘంలోవిశేషమైన గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు.శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.వృత్తివ్యాపారాలు లాభాల బాట పడతాయి ఉద్యోగమున సమస్యలు తొలగుతాయి. 

కన్య

ఉత్తర2,3,4, హస్త 1,2,3,4,చిత్త 1,2,

ఆర్థిక లావాదేవీల్లో ఒత్తిడి, హడావుడి అధికంగా ఉంటాయి. అర్థాంతరంగా నిలిచిన పనులు పునఃప్రారంభమవుతాయి. స్త్రీలకు షాపింగులలో ఏకాగ్రత అవసరం. దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదాపడతాయి. మొండిబాకీలు వసూలు కాగలవు.చిన్న చిన్న విషయాలకు మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి.చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి ఋణప్రయత్నాలుకలిసిరావు.ప్రయాణాలలోవాహనఇబ్బందులు ఉంటాయి.వ్యాపారాలుసామాన్యంగా సాగుతాయి ఉద్యోగమున ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. 


తుల

చిత్త 3,4, స్వాతి 1,2,3,4, విశాఖ1,2,3,

ఆర్థిక విషయాలలో చురుకుదనం కానవచ్చును. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి విద్యార్థులకు మిత్ర బృందాలు పెరుగుతాయి. ఫ్లీడర్లకు పురోభివృద్ధి. వైద్యులకు ఒత్తిడి, ఇంజనీరింగ్ రంగాలలో వారికి చికాకు తప్పదు. ఊహించని ఖర్చులు అధికం కావడం వల్ల ఆందోళన తప్పదు.నూతన వ్యక్తుల పరిచయం లాభిస్తాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. రుణాలు తీర్చగలుగుతారు అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. దైవారాధన చేయడం వలన మానసిక ప్రశాంతత కలుగుతుంది.వ్యాపారాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది.ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. 


వృశ్చికం

విశాఖ 4, అనురాధ 1,2,3,4,జ్యేష్ఠ 1,2,3,4,

ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను ధీటుగా నిర్వహిస్తారు. మిత్రులను కలుసుకుంటారు. మీ శ్రీమతి ఆరోగ్యంలో ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది. సోదరీ, సోదరుల కలయిక పరస్పర అవగాహన కుదురును. విద్యార్థులలో చురుకదనం కానరాగలదు.ఆర్ధిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత కలుగుతుంది.ప్రయాణాల్లో ఆకస్మిక మార్పులు ఉంటాయి.పుణ్యక్షేత్రాలు చేస్తారు సందర్శిస్తారు వృత్తి వ్యాపారాలలో కింది వారి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది ఉద్యోగమున అదనపు పనిభారం ఉంటుంది. 


ధనుస్సు

ఆర్థిక పరిస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధికి చేసే కృషిలో బాగా రాణిస్తారు. స్థిరచరాస్తుల కొనుగోలు విషయమై ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. మీకు అత్యంత సన్నిహితులైన ఒకరు మీకు చాలా వేదన కలిగిస్తారు.

 మీ అభిలాష నెరవేరే సమయం ఆసన్నమైనదని గమనించండి.ఆర్థికపరంగా చిక్కులు ఉంటాయి సోదరులతో స్థిరాస్తి సంబంధిత సమస్యలు పెరుగుతాయి.సకాలంలో పనులు పూర్తికాక మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దూరప్రయాణాలు ఉన్నవి.వృత్తి, వ్యాపారాలలో ప్రభుత్వ సంభందిత ఇబ్బందులు కలుగుతాయి . నిరుద్యోగులకు ఆశించిన ఫలితాలు ఉండవు. 


మకరం

ఉత్తరషాఢ 2,3,4,శ్రవణం 1,2,3,4,ధనిష్ట 1,2,

ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కష్టపడి పనిచేస్తే డబ్బు దానంతట అదే వస్తుంది. ప్రయాణాలలో ఒత్తిడి, చికాకులు తప్పవు. మిమ్మల్ని హేళన చేసేవారు మీ సహాయాన్ని అర్థిస్తారు.వాహనం నడుపునపుడు మెళకువ అవసరం.సంఘంలో పెద్దలతో పరిచయాలు పెరుగుతాయి చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.వ్యాపారాలలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో పురోగతి కలుగుతుంది.



కుంభం

ధనిష్ట 3,4, శతభిషం 1,2,3,4, పూ||భా||1,2,3,

స్థిరచరాస్తుల విషయంలో మెళకువ అవసరం. ఆలయాలను సందర్శిస్తారు. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలలో మెళకువ అవసరం. విద్యార్థులకు అభివృద్ధి కానవస్తుంది. గృహంలో వస్తువు పోవడానికి అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి.కొన్ని విషయాలు ఆశ్చర్యపరుస్తాయి సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి ఆర్ధిక సహాయం లభిస్తుంది వ్యాపారమునకు నూతన ప్రణాళికలు రూపొందిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పనులు సకాలంలో పూర్తి చేసి అధికారుల మన్ననలు పొందుతారు .  


మీనం

పూ||భాధ్ర||4,ఉ||భా||1,2,3,4,రేవతి1,2,3,4,

ఉభయల మధ్య కలహాలు తలెత్తుతాయి. సొంతంగా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. ఖర్చులు అధికం. మీకు ఉద్యోగంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఏదన్నా అమ్మకానికి చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇతరుల సలహాను పాటించుట వల్ల సమస్యలు తప్పవు.వ్యయ ప్రయాసలతో గాని పనులు పూర్తి కావు. బంధు మిత్రులతో ఆకస్మిక వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.ఆధ్యాత్మిక విషయాల పై దృష్టి మరలుతుంది. వృత్తి వ్యాపారాలలో నిలకడ లోపిస్తుంది ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది.  



కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు