Hot Posts

6/recent/ticker-posts

BSNL ఉద్యోగుల సంబురాలు

 సంస్థ పది కాలాల పాటు నిలవాలని VRS  ఉద్యోగుల ఆకాంక్ష  

హైదరాబాద్,జనవరి 31 (ఉదయ కిరణాలు) బి ఎస్ ఎన్ ఎల్ అభివృద్ధిలోకి రావాలని, BSNL ను మించి ఏ సర్వీసు లేదని స్వచ్చంద విరమణ పొందిన ఉద్యోగులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వీఆర్ఎస్ తీసుకొని సంవత్సర కాలం పూర్తైన శుభ సందర్బంగా  BSNL  అధికారులతో కలసి వేడుకలు జరుపుకున్నారు.        ఈ సందర్బంగా వారు కేక్ కట్ చేసి ఒకరితో ఒకరు ఆప్యాయతను పంచుకున్నారు. BSNL జిందాబాద్, అంటూ ఎక్కువ కాలం స్థిరంగా BSNL  సంస్థ ఉండాలని పాత కస్టమర్లందరూ మళ్ళీ తిరిగి BSNL  సేవల వైపు తిరిగి చూడాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో BSNL ఎస్డీఓపి డి. చందూలాల్,సురేష్ కుమార్, జిల్లా కార్యదర్శి ఎం.మోహన్ రావు, జి. పి. శ్రీనివాస్,పి. వెంకటేష్,మైసయ్య,నర్సింహా రెడ్డి,నారాయణ స్వామి, జె. వై. కుమార స్వామి, మహమ్మద్ గౌస్, బ్రహ్మం, నర్సింగ్ రావు సి. రమేష్, ఆర్. వెంకటేష్,స్వామీ,ఎం. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు