Hot Posts

6/recent/ticker-posts

గాన గంధర్వుడికి దక్కింది పద్మ విభూషణ్


చెన్నై,జనవరి26(ఉదయ కిరణాలు): మరణానంతరం గానగంధర్వుడు ఎస్పీ బాలుని పద్మవిభూషన్‌ వరించడం తెలుగు వారిగా మనకు గర్వకారణం. ఇంకా సమున్నత శిఖరాలకు ఎదుగుతున్న తరుణంలో కరోనా మృత్యు రూపంలో రావడం మనకు తీరని వేదనను మిగిల్చింది. పద్మ పురస్కారాలో విశిష్ఠమైన పద్మవిభూషణ్‌ను అందుకోవడానికి ఆయన మన మధ్య లేరు. సోమవారం రాత్రి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించిన అనంతరం యావత్‌ భారతదేశ సంగీత ప్రియుల మదిలో మరోసారి మెదిలిన పేరు శ్రీపతి పండితారాధ్యులు బాల సుబ్రహ్మణ్యం. తెలుగువారు అభిమానంతో ఎస్పీ బాలుగా పిలుచుకునే మన బాలుకు ఈ అత్యుత్తమ పురస్కారం రావడం మనకందరికీ గర్వ కాణంగానే చూడాలి. గాయకునిగా, నటునిగా, సంగీత దర్శకునిగా, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ గా, నిర్మాతగా... ఇలా బహుముఖ పాత్రలు పోషించారు బాలు ... వేలాది పాటలు పాడి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ లో చోటు సంపాదించారు... ఆయన ప్రతిభను వెదుక్కుంటూ ఎన్నో రాష్ట్ర, జాతీయ అవార్డులు బాలును వరించాయి... టీవీల్లో సంగీత కార్యక్రమాలు నిర్వహించి పలువురు ప్రతిభావంతులైన గాయనీగాయకులు  తెలుగు సినిమా రంగానికి పరిచయమయ్యేలా చేశారు బాలు... తుది శ్వాస విడిచే వరకూ అలు పెరగని బాటసారిలా పయనించారు. భారతీయ చలన చిత్రసీమలో తనదైన ముద్రను బలంగా వేసిన బాలు  కన్నుమూసిన తర్వాత ఆయనకు కేంద్ర ప్రభుత్వం ’భారతరత్న’ పురస్కారం ఇవ్వాలని చాలామంది వాంఛించారు. కానీ పద్మవిభూషణ్‌తో సరిపెట్టుకోవాల్సి రావడం వారి మనసుకు కాస్తంత కష్టం కలిగించింది. అయితే... పద్మపురస్కారాలో అత్యన్నమైన ఈ పురస్కరాన్ని పొందిన దక్షిణాది సినీ ప్రముఖులు  సైతం చేతివేళ్ల విూద లెక్కించేంత మందే ఉన్నారు. ఆ అరుదైన గౌరవం బాలుకు దక్కడం  తృప్తిని కలిగిస్తుందన్నది వాస్తవం.నెల్లురులో 1946 జూన్‌ 4 న జన్మించిన బాలు సంగీత ప్రపంచంలో అందనంత ఎత్తుకు ఎదిగి ఎందరో శిష్యులను తనకు వారసులుగా పరిచయం చేసి పోయారు. మిత్రుల  ప్రోత్సాహంతో సినిమాల్లో గాయకునిగా ప్రయత్నాలు  మొదలెట్టారు...ఆ ప్రయత్నాల్లోనే ఆయనకు ఇళయరాజా పరిచయమయ్యారు... ఇద్దరూ అవకాశాల  కోసం ఎన్నో పాట్లు పడ్డారు... చివరకు ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్‌.పి. కోదండపాణి తన స్వరకల్పనలో రూపొందిన ’శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్నకథ’లో ఓ పాట పాడించారు... ఇది నలుగురితో పాటు నారాయణ అనే పాట... ఇందులో శోభన్‌ బాబుకు బాలు ప్లేబ్యాక్‌ పాడారు... అలా బాలు సినిమా కెరీర్‌ ఆరంభ మయింది... ఘంటసాల  ఏకఛత్రాధిపత్యం సాగుతున్న ఆ రోజుల్లో పీబీ శ్రీనివాస్‌ వంటి మెలోడీ కింగ్‌ సైతం పరభాషా చిత్రాల్లోనే రాణించేవారు. మరి బాలు లాంటి వర్ధమాన గాయకునికి అవకాశాలు  వెంటవెంటనే ఎలా లభిస్తాయి? అందుకే ఘంటసాల మాస్టారు పాడే సినిమాకు ట్రాక్‌ సింగర్‌ గా పాడేవారు బాలు... కొన్ని సందర్భాల్లో ఘంటసాల ఆ ట్రాక్స్‌ విని బాలు గాత్రాన్నే ఉపయోగించుకోమని చెప్పిన సందర్భాలు  ఉన్నాయి... ఓ వైపు ఘంటసాల, మరోవైపు కోదండపాణి... ఇద్దరూ బాలును ప్రోత్సహించడంతో మనకు మరపురాని బాలు దక్కారు. తన అభిమాన గాయకుడు ఘంటసాలతో కలసి బాలు మూడు సినిమాల్లో పాడారు... ’ఏకవీర, మంచిమిత్రులు, దేవుడు చేసిన మనుషులు’... ఈ మూడు చిత్రాలు బాలుకు గాయకునిగా మంచి గుర్తింపును సంపాదించి పెట్టాయి. బాలు కెరీర్‌ ను ఓ మలుపు తిప్పిన చిత్రం ’చెల్లెలికాపురం’... కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో శోభన్‌ బాబు హీరోగా రూపొందిన ఈ చిత్రంలో బాలు పాడిన ’చరణ కింకిణు...’ గీతం అప్పట్లో ఆంధ్రదేశాన్ని ఓ ఊపు ఊపింది... శోభన్‌ బాబుకు ప్లే బ్యాక్‌ పాడుతూ సినిమా రంగప్రవేశం చేసిన బాలుకు... అదే హీరోకు పాడిన పాటతో మంచి బ్రేక్‌ రావడం విశేషం... ఆనాటి టాప్‌ హీరోస్‌ యన్టీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజుతో పాటు చంద్రమోహన్‌, మురళీమోహన్‌, మోహన్‌ బాబు, చిరంజీవి వంటి  హీరోస్‌ అభినయానికి కూడా బాలు  గాత్రం జీవం పోసింది... మాతృభాష తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లోనూ బాలు  గళం వినిపంచారు. తెలుగులో ఘనవిజయం సాధించిన ’మరో చరిత్ర’ ఆధారంగా హిందీలో తెరకెక్కిన ’ఏక్‌ దూజే కేలియే’ సినిమాలో బాలు పాడిన పాటలు కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు ఆబాలగోపాలాన్ని అలరించాయి... ఆ సినిమా విజయంతో బాలీవుడ్‌ సైతం బాలు పాటలకు దాసోహం అంది.  కె.విశ్వనాథ్‌ తెరకెక్కించిన ’శంకరాభరణం’లో తనదైన శైలిలో శాస్త్రీయ సంగీతాన్నీ ఆలపించారు...ఆ తరువాత మళ్లీ కె.విశ్వనాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ’సాగరసంగమం’ చిత్రంలోని ’వేదం అణువణువున నాదం...’ పాట కూడా బాలును మరోమారు జాతీయ వేదికపై ఉత్తమ గాయకునిగా నిలబెట్టింది. కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌, జెమినీగణెళిశన్‌ వంటి పరభాషా నటులకు బాలు గాత్రం ప్రాణం పోసింది... ’అన్నమయ్య’ చిత్రంలో సుమన్‌ కు బాలు చెప్పిన డబ్బింగ్‌ ఆయనకు బెస్ట్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ గా నంది అవార్డు సంపాదించి పెట్టింది... 

గాయకునిగానే కాకుండా నటునిగానూ బాలు  పలు అవార్డు రివార్డులు  సొంతం చేసుకున్నారు. గాయకునిగా గంధర్వుడే ఇలకు దిగివచ్చాడనిపించుకున్న బాలు... సంగీత దర్శకునిగానూ వీనులవిందు చేసే బాణీతో అలరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు