చిత్ర కిరణాలు : సినిమా ప్రతినిధి
మహానటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నాగ్ అశ్విన్ ప్రస్తుతం ప్రభాస్ సినిమా పనులతో బిజీగా ఉన్నాడు. స్కై థ్రిల్లర్ స్జబెక్టు తో ఈ సినిమాను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తుంది. దాదాపు 500 కోట్ల బ్జడెట్‌తో వరల్డ్ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను అశ్వినీదత్ నిర్మించనున్నాడు. గత కొద్ది రోజులుగా ఈ సినిమా నుండి ఎలాంటి అప్‌డేట్స్ రాకపోయే సరికి నెటిజన్స్ నిరూత్సాహం చెందుతున్నారు. తాజాగా ఓ నెటిజన్ వచ్చే సంక్రాంతికి వస్తుందేమో అని కామెంట్ పెట్టాడు. నెటిజన్ రిప్లైకు స్పందించిన నాగ్ అశ్విన్ ..జనవరి 29 మరియు ఫిబ్రవరి 26 తేదిలో సర్‌ప్రైజెస్ రానున్నాయి అంటూ ట్వీట్ చేశారు. నాగ్ అశ్విన్ ట్వీట్‌తో అభిమానులలో ఆనందం వెల్లివిరిసింది. ప్రభాస్ నటిస్తున్న సలార్, ఆదిపురుష్ చిత్రా కన్నా నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న పీరియాడికల్ మూవీపైనే భారీ అంచనాలు ఉన్నాయి. బాలీవుడ్ అగ్రకథానాయిక దీపికా పదుకొణెళి హీరోయిన్. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటించనున్నారు. ఈ సినిమా గురించి ప్రకటన వచ్చి ఏడాది గడుస్తున్నా షూటింగ్ ఇంకా ప్రారంభం కాలేదు. ఈ సినిమా కంటే వెనుక ప్రకటించిన ’ఆదిపురుష్’, ’సలార్’ సినిమా ఫస్ట్‌లుక్ కూడా విడుదలైపోయాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్‌కు ఇక పండగే.
0 కామెంట్‌లు