Hot Posts

6/recent/ticker-posts

చెక్‌ చిత్రంలో విభిన్నమైన రోల్‌లో నితిన్‌

చిత్ర కిరణాలు : సినిమా ప్రతినిధి 

ఉరిశిక్ష పడిన ఓ ఖైదీ చెస్‌ గేమ్‌ ద్వారా తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్న కథ ఆధారంగా చెక్‌ సినిమా రాబోతున్నది. నితిన్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ’చెక్‌’. భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి.ఆనంద్‌ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకుడు. రకుల్‌ ప్రీత్‌సింగ్‌, ప్రియా ప్రకాష్‌ వారియర్‌ కథానాయికలు. ఫిబ్రవరి 19న ఈ చిత్రం విడుదల కానుంది. నిర్మాత మాట్లాడుతూ ’జైలు నేపథ్యంలో యాక్షన్‌ థ్రిల్లర్ ‌గా రూపొందిస్తున్నాం. చెస్‌ గేమ్‌లో నిష్ణాతుడైన ఓ ఖైదీ కథ ఇది. అతడు ఎలా జైలు పాలయ్యాడు? తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకున్నాడా? లేదా?అన్నది ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఆద్యంతం ఉత్కంఠభరితమైన మలుపుతో సాగుతుంది. నితిన్‌ పాత్ర చిత్రణ నవ్యరీతిలో ఉంటుంది. కథానాయికలు  ప్రాముఖ్యమున్న పాత్రల్లో కనిపిస్తారు.  తెలుగు ప్రేక్షకులకు నవ్యానుభూతిని పంచే చిత్రమిది’ అని తెలిపారు. పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, త్రిపురనేని సాయిచంద్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కల్యాణిమాలిక్‌, ఛాయాగ్రహణం: రాహుల్‌ శ్రీవాత్సవ్‌.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు