న్యూఢిల్లీ ,జనవరి25(ఉదయ కిరణాలు): ప్రపంచంలోని చాలా దేశాల్లో ప్రజలు ఓటు హక్కు కోసం దశాబ్దాల తరబడి పోరాడాల్సి వచ్చిందని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఎంతో శ్రమపడి సాధించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ గౌరవించి, సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు. మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న యువతీ, యువ కులపై ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉందన్నారు. నేడు జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాల్లో ఒకటైన అమెరికాలో కూడా ఓటు హక్కు కోసం ప్రజలు చాలా కాలం పోరాడారని గుర్తు చేశారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి మాతృకైన బ్రిటన్లో చాలా కాలం పాటు మహిళలకు ఓటు హక్కు లేదని తెలిపారు. అయితే స్వాతంత్య్రం వచ్చాక మన దేశ రాజ్యంగం.. 21ఏళ్లున్న ప్రతి ఒక్కరికీ ఎలాంటి వివక్ష లేకుండా ఓటు హక్కు ఇచ్చిందని గుర్తుచేశారు. ఆ తర్వాత కొద్ది కాలానికి వయస్సును 18 ఏళ్లకు తగ్గించినట్లు గుర్తు చేశారు .
0 కామెంట్‌లు