Hot Posts

6/recent/ticker-posts

రానున్నాయి భగీరథ వాటర్‌ బాటిల్స్‌!!


ముందుగా ప్రభుత్వ కార్యాయాలకు బాటిళ్ల సరఫరా

హైదరాబాద్‌,జనవరి25(ఉదయ కిరణాలు): త్వరలో ప్రభుత్వ బ్రాండ్‌తో ఒక వాటర్‌ బాటిల్‌ రానుంది .. మొన్నటి వరకు వేరే బ్రాండ్లతో వాటర్‌ తాగగా అతి త్వరలో తెలంగాణ రాష్ట్రం ఒక వాటర్‌ బాటిల్‌ని అందుబాటులోకి తీసుకురానుంది.  తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిషాత్మకంగా చేప్పట్టిన పథకం మిషన్‌ భగీరథ .. ఇటీవలే 100 శాతం టాప్‌ కనెక్షన్‌ ఇచ్చిన రెండవ రాష్ట్రంగా తెలంగాణ కేంద్రం నుండి ప్రశంసలు అందుకుంది .. ప్రతి ఇంటికీ తాగునీరు సరఫరా చేస్తోన్న ఏకైక పెద్ద రాష్ట్రంగా తెలంగాణ రికార్డ్‌ క్రియేట్‌ చేసింది. ఈ పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం 37 వేల కోట్లు ఖర్చు చేసింది.నగరంతో పాటు మారుమూల ప్రాంతాలకు కూడా తాగునీటి సౌకర్యం కల్పించింది. మినరల్‌ వాటర్‌ తాగాల్సిన అవసరంలేదని ఈ మిషన్‌ భగీరథ నీళ్లే మంచివని ప్రభుత్వం తెగ ప్రచారం చేస్తోంది. అయితే ప్రభుత్వ ఆఫీసుల్లోనూ ఉద్యోగులకు మిషన్‌ భగీరథ వాటర్‌ బాటిళ్లను పంపిణి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. చూడటానికి బాటిల్స్‌ లాగా ఉండి మధ్యలో తెలంగాణ లోగోతో పాటు.. రాష్ట్ర మ్యాప్‌ మరియు మిషన్‌ భగీరథ అనే అక్షరాలుతో కలిగిన స్టిక్కర్లు అంటించి ఉన్నాయి .. బిస్లరీ, హిమాలయ, కిన్లే లాంటి వాటర్‌ బాటిళ్లను వాడిన ప్రభుత్వ అధికారులు.. అతి త్వరలోనే ప్రభుత్వ బ్రాండ్‌ వాటర్‌ తాగనున్నారు .. నిజంగా మిషన్‌ భగీరథ నీటిని వాటర్‌ బట్టిల్స్‌ ద్వారా ప్రభుత్వ అధికారులకు అందించడం గొప్ప విషయం వారితో పాటు వాటిని ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకువస్తే ఇంకా బాగుంటుంది .. అయితే ఈ సందర్బంగా టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌ కుమార్‌ తన ఉద్యోగులకు ప్రభుత్వం ఉచితంగా తాగునీటి బాటిళ్లను సరఫరా చేస్తుందని ఎవరైనా ఊహించారా అని అన్నారు. మిషన్‌ భగీరథ పథకం నుండి వాటర్‌ బాటిళ్లను తీసుకురావడం కేసీఆర్‌ ఘన విజయం అని అయన అన్నారు . తొందరలోనే ప్రభుత్వ కార్యాయాలకు మిషన్‌ భగీరథ బాటిళ్లను సరఫరా చేయనున్నట్లు ఎంపీ సంతోష్‌ కుమార్‌ పేర్కొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు