హైదరాబాద్,జనవరి 22 (ఉదయ కిరణాలు) దశాబ్దాల నిరీక్షణానంతరం హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీ సీతారామచంద్రుల వారికి తమ జన్మ స్థలమైన అయోధ్యలో భవ్య "రామ మందిర " నిర్మాణానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు తీర్పు ద్వారా మార్గం సుగమం అవడంతో ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న విషయం విదితమే. అయోధ్యలో భవ్య శ్రీ రామ మందిర నిర్మాణానికి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతుండగా శ్రీ రామ భక్తులందరినీ మందిర నిర్మాణంలో భాగస్వాములను చేయాలన్న సత్సంకల్పంతో ఆలయ ధర్మకర్తలైన "శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర" వారు దేశవ్యాప్తంగా శ్రీ రామ మందిర నిర్మాణ "సమర్పణ నిథి" పేర విరాళాలను సేకరిస్తున్నది. ఈ పవిత్ర దైవ కార్యాన్ని జీర్ణించుకోలేని కొందరు అవివేకులు హిందువుల ఆరాధ్య దైవమైన "శ్రీ రామచంద్రుడిని" అవహేళన చేస్తూ హేయమైన వ్యాఖ్యలు చేయడాన్ని యావత్ హిందూ సమాజం ముక్త కంఠంతో ఖండిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం లోని కొందరు ప్రముఖులు ఈ రకమైన దాష్టీకానికి పూనుకోవడాన్ని గర్హిస్తూ భారతీయ జనతా పార్టీ సనత్ నగర్ డివిజన్ అధ్యక్షుడు క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రీ రామ భక్తులు సనత్ నగర్ నెహ్రూ పార్క్ వద్ద గల పార్టీ జెండా దిమ్మ వద్ద నుండి స్వామి టాకీస్ లేబర్ అడ్డా వద్ద వరకు ఊరేగింపుగా వెళ్ళి అటువంటి దుష్టశక్తుల దిష్టి బొమ్మను దగ్ధం చేసారు. ఎంతటి స్థాయి వ్యక్తులైనా హిందువుల మత విశ్వాసాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే హిందూ సమాజం ఉపేక్షించదని, ఒక్క తాటిన నిలిచి తీవ్రంగా ప్రతిఘటిస్తుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ నాయకులు యేచన్ సురేష్, ఆకూరి శ్రీనివాస్ రావు, మూల రవీందర్, సత్యనారాయణ గుప్త, భాస్కర్,ఆకుల మహేష్, శ్రీనివాస్ రావు, పి సునీల్ కుమార్,లక్ష్మీనారాయణ, చంద్ర కుమార్, భాస్కర్, బంటీ, శ్రీనివాస్ యాదవ్, వరప్రసాద్ చారి, వారణాసి, పెరుమాళ్ళ వైష్ణవి, మాధవి తదితరులు పాల్గొన్నారని పొలిమేర సంతోష్ కుమార్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.
0 కామెంట్‌లు