రైతులకు మద్దతుగా రాష్ట్రపతి ప్రసంగం
రైతులు కూడా సామరస్య విధానంతో సాగాలి
ట్రాక్టర్ ర్యాలీతో ఘర్షణకు దిగడం సరికాదు
న్యూఢిల్లీ,జనవరి26(ఉదయ కిరణాలు): దేశంలోని ప్రతి భారతీయుడు అన్నం పెట్టే రైతన్నకు సెల్యూట్ చేయాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. 72వ రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకలు సందర్భంగా ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా వంటి కష్ట సమయంలోనూ అన్నదాతలు సాగులో వెనకుడుగు వేయలేదని, వారి కృషి వల్లే దేశం ఆహారొత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించిందని తెలిపారు. దేశానికి రైతు ఆహార భద్రత అందిస్తుంటే, సైనికులు సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం గస్తీ కాస్తున్నారని అన్నారు.దేశంలో అన్నదాతలు ఆందోళన చేస్తున్న వేళ..వారు వద్దనుకుంటున్న చట్టాల గురించి చర్చ చేయడం ద్వారా ప్రభుత్వం ఓ మంచి సందేశం ఇవ్వగలగాలి. నిపుణలతో చర్చించి వారికి ఎలా చేస్తే న్యాయం జరగగలదో ఆలోచన చేయాలి. అన్నదాతలను నిత్యం మననం చేసుకుంటున్న మనం వారికి న్యాయం చేసే విషయంలో కొత్త చట్టాలు అవసరమనుకుంటే ఎలా అవసరమో చెప్పి ఒప్పించాలి. కొత్త వ్యవసాయ చట్టాల రద్దును కోరుతూ అనేక రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులతో కేందప్రభుత్వం సవ్యంగా వ్యవహరించడం లేదన్నది న్యాయస్థానం అభిప్రాయం. రైతులకూ, కేందప్రభుత్వానికీ మధ్య ఎంతో కాలంగా తెగని ఈ వివాదాన్ని సామరస్య పూర్వకంగా పరిష్కరించడానికీ, పీటముడి విప్పడానికీ సుప్రీంకోర్టు ప్రయత్నం చేసింది. సుప్రీంకోర్టు ప్రతిపాదన కచ్చితంగా పాలకులను ఒక పెద్ద సంక్షోభం నుంచి రక్షించి ఒడ్డున పడేసేదిగా గుర్తించాలి. అలాగే ఆందోళన చేస్తున్న రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గాకుండా చట్టాలకు వ్యతిరేకంగా పోరాడాలి. కానీ వారి ఆందోళనలు చూస్తుంటే నిజాయితీపై అనుమానాలు కలుగుతున్నాయి. తాజాగా ట్రాక్టర్ ర్యాలీ సందర్బంగా వారు దూసుకుని వస్తున్న తీరు ఢిల్లీని ఢీకొనాడికి అన్నట్లుగా ఉంది. రైతులు అనేక రోజులుగా ఎదుర్కొంటున్న కష్టాలు, భయంకరమైన చలి వాతావరణం, కొంతమంది రైతుల ఆత్మహత్యలు, కరోనా భయాలు ఇత్యాది అంశాల్లో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు సరైనవే. ఎండనీ, చలినీ ఎదుర్కొంటున్న వృద్ధరైతులు, మహిళలు, పిల్లలపై కోర్టు ప్రత్యేకంగా సానుభూతి ప్రకటించింది. ఎంతో ప్రశాతంగా జరుగుతున్న ఈ రైతు ఉద్యమం ఒక చిన్న నిప్పురవ్వ కారణంగా శాంతి భద్రతలకు ప్రమాదకరంగా పరిణమించవచ్చునని సుప్రీం న్యాయమూర్తులకు అనిపించింది. కానీ తాజా ఘటనలు చూస్తుంటే అలాగే ఉన్నాయని అనుమానం వేస్తోంది. చట్టాలు చేసిన ప్రభుత్వమే వాటిని రద్దుచేయాలన్న డిమాండ్‌తో ఉద్యమిస్తున్నారు. ఈ అంశం న్యాయవ్యవస్థ చేతుల్లోకిపోతే తమ డిమాండ్ బలహీన పడుతుందన్న భయం వారిది. ఆ మూడు చట్టాల్లోని అన్యాయాన్నీ, కాఠిన్యాన్నీ ఈ రాయితీలూ, మినహాయింపు ఎంతమాత్రం సరిదిద్దవన్నది రైతు వాదన. చేసిన చట్టాలు రాజ్యాంగ విహితమా కాదా అన్న వివాదం ఉత్పన్నమైనప్పుడు మాత్రమే న్యాయవ్యవస్థ జోక్యం సర్వసాధారణం. మొత్తంగా ప్రభుత్వం రైతుల సమస్యలకు పరిష్కారం చూపాలి. రైతులు కూడా సంయమనంతో వ్యవహరించాలే తప్ప సమరం చేయరాదని రాంనాథ్ కోవింద్ పిలుపునిచ్చారు.
0 కామెంట్‌లు