మే 17నుంచి 26 వరకు పరీక్షలు
మే 26 నుంచి జూన్ 13 వరకు వేసవి సెలవులు
హైదరాబాద్,జనవరి23(ఉదయ కిరణాలు): తెలంగాణలో పదో తగరతి పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రాంచంద్రన్ ఉత్తర్వులు జారీ చేశారు. మే 17వ తేదీ నుంచి 26వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి 9, 10వ తరగతుల విద్యార్థులకు పాఠాలు బోధించనున్నారు. పది పరీక్షలు ముగిసిన మరుసటి రోజు మే 26 నుంచి జూన్ 13వ తేదీ వరకు వేసవి సెలవులు ప్రకటించారు. గతంలో ఆరు స్జబెక్టులకు 11 పరీక్షలు నిర్వహించేవారు. కానీ ఈసారి కేవలం ఆరు స్జబెక్టులకు ఆరు పరీక్షలు నిర్వహించనున్నారు. నాలుగు ఎఫ్ఏ టెస్టులకు గానూ రెండు ఎఫ్ఏ టెస్టులను మాత్రమే నిర్వహించనున్నారు. మొదటి ఎఫ్ఏను మార్చి 15న, రెండో ఎఫ్ఏ టెస్టును ఏప్రిల్ 15న నిర్వహించనున్నారు. సమ్మేటివ్ అసెస్మెంట్ను మే 7 నుంచి 13వ తేదీ మధ్యలో నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. , 10వ తరగతుల విద్యార్థులు స్కూల్కు తప్పనిసరిగా హాజరు కావాల్సిన అవసరం లేదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సరిపడా హాజరు శాతం లేనప్పటికీ విద్యార్థులను పబ్లిక్ పరీక్షలకు అనుమతించనున్నారు. జిల్లాల్లో ఉదయం 9:30 గంట నుంచి సాయంత్రం 4:45 గంట వరకు, హైదరాబాద్ జిల్లాలో ఉదయం 8:45 నుంచి సాయంత్రం 4 గంట వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఆన్లైన్ క్లాసులైతే పదో తరగతి విద్యార్థులకు ఉదయం 10 నుంచి 11 గంట మధ్య, 9వ తరగతి విద్యార్థుకు సాయంత్రం 4 నుంచి 5 గంట మధ్య నిర్వహించనున్నారు.
0 కామెంట్లు