హక్కులతోపాటు విధులు తెలుసుకోవాలి
రంగారెడ్డి,జనవరి 26 (ఉదయ కిరణాలు) అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగ ఫలాలు ప్రతీ ఒక్కరికీ, అన్ని వర్గాలకు అందాలన్నదేశ ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమని మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ అన్నారు. 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నియోజకవర్గం పరిధిలోని బీజేపీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. నరేంద్రమోడీ ప్రధాని అయ్యాక అంతర్జాతీయ ఖ్యాతి, అభివృద్ధి పెరిగిందన్నారు. దేశ రక్షణలో రాజీలేని పోరాటం చేస్తున్న సైనికులకు, స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన పౌరులకు పాదాభివందనం చెప్పారు. హిందూవుల ఆరాధ్య దైవం అయోధ్య శ్రీరాముడికి గుడి నిర్మాణం ఈ శతాబ్దంలో నిర్మాణం కావటం మన అందరి అదృష్టమన్నారు. మన హక్కులతోపాటు విధులు ప్రతీ పౌరుడు తెలుసుకున్నప్పుడే అంబేద్కర్ రాసిన రాజ్యాంగస్ఫూర్తి నెరవేరుతుందని చెప్పారు. చట్టాలకు ఎవరూ అతీతులు కాదన్న ఆయన వ్యక్తి ప్రాధాన్యం కంటే దేశమే ముఖ్యమన్న భావన ప్రతీ ఒక్కరిలో కలిగినప్పుడే కచ్చితంగా సుసంపన్నమైన, సుభిక్షమైన భారతదేశం అవుతుందన్నారు.ఈ సందర్బంగా మహేశ్వరం నియోజకవర్గం ప్రజలు, రాష్ట్ర అధినాయకత్వానికి గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియ జేశారు.
0 కామెంట్‌లు