Hot Posts

6/recent/ticker-posts

బచ్చన్‌ పాండేగా అక్షయ్‌ కుమార్‌

 జనవరి 26న విడుదలకు రంగం సిద్ధం 

హైదరాబాద్, జనవరి 24 (ఉదయ కిరణాలు)

ప్రతి ఏడాది నాలుగైదు సినిమాలతో ప్రేక్షకులని పలకరించే అక్షయ్‌ కుమార్‌ గత ఏడాది కరోనా వలన అరించలేకపోయాడు. ఈ ఏడాది మాత్రం వరుస సినిమాతో ప్రేక్షకులని ఫుల్‌ ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం అతని చేతిలో సూర్య వంశీ, బెల్‌ బాటమ్‌, బచ్చన్‌ పాండే, అతరంగీ రే,  ’పృథ్వీరాజ్‌ చౌహాన్‌’ జీవిత చరిత్రపై ’పృథ్వీరాజ్‌’ , రామ్‌ సేతు అనే సినిమాలు ఉన్నాయి. తాజాగా బచ్చన్‌ పాండే చిత్రానికి సంబంధించి పోస్టర్‌ రిలీజ్‌ చేస్తూ ఈ మూవీ రిలీజ్‌ డేట్‌ ప్రకటించాడు. బచ్చన్‌ పాండే చిత్రం ఫర్హాద్‌ సవ్జిూ దర్శకత్వంలో తెరకెక్కగా, సాజిద్‌ నడియావాలా నిర్మించారు. ఈ చిత్రంలో అక్షయ్‌ సరసన కృతి సనన్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ హీరోయిన్స్‌గా నటించారు . మరో ముఖ్యపాత్రలో అర్షద్‌ వార్సీ నటిస్తున్నాడు. రిపబ్లిక్‌ డే సందర్భంగా బచ్చన్‌ పాండే చిత్రాన్ని జనవరి 26, 2022న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. అయితే తాజాగా విడుద చేసిన పోస్టర్‌ లో అక్షయ్‌ కుమార్‌ పిల్లి కన్నుతో భయంకరంగా కనిపిస్తున్నాడు.  


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు