దుర్గమ్మ సన్నిధిలో ఉచిత దర్శన భక్తులను పట్టించుకోని కమిటి
విజయవాడ,జనవరి22(ఉదయ కిరణాలు): ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో భక్తులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. ఉచిత దర్శనానికి వచ్చే భక్తులకు సింగిల్ కౌంటర్‌ని ఏర్పాటు చేసి భక్తులను ఆలయ అధికారులు ఇబ్బందు పెడుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి సమయం 11 కావస్తున్నా ఉచిత దర్శనానికి టికెట్లు అందకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. 100 రూపాయల టిక్కెట్లు, 300 రూపాయల టికెట్ల కౌంటర్‌కు మాత్రమే ఆలయ అధికారులు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని... ఉచిత దర్శనం కోసం పడిగాపులు పడుతున్నామని భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
0 కామెంట్‌లు