Hot Posts

6/recent/ticker-posts

అమెరికాతో మన సంబంధాలు మరింత బలోపేతం


బో బైడన్‌ 
రాకతో ఎన్నారైల్లోనూ ఆనందం

వాషింగ్టన్‌,జనవరి21(ఉదయ కిరణాలు): ట్రంప్‌ భారత ప్రధాని మోదీకి సన్నిహితుడు. ఇరువురిదీ జాతీయవాద ఎజెండాయే. చైనాను ప్రతిఘటించే విషయంలో ట్రంప్‌ ప్రభుత్వం భారత్‌కు బాసటగా నిలిచింది. ఈ విషయంలో బైడెన్‌ కూడా అదే రీతిన కొనసాగుతారని భారత విదేశాంగ వర్గాలు భావిస్తున్నాయి. భారత్‌తో ఉన్న వాణిజ్య సమస్యల  విషయంలో మాత్రం బైడెన్‌ అంత సులువుగా సానుకూలత కనబర్చక పోవచ్చని అంటున్నారు. అయితే ప్రధాని మోడీ అనుసరించే విధానాలను బట్టి మన సంబంధాలు ఆధారపడి ఉంటాయి. అయితే ఇటీవలి కాలంలో మనం అధ్యక్షుడుగా ఎవరున్నా అమెరికాతో మంచి సంబధాలనే నెరపుతున్నాం.  కనుక విదేశాంగ విధానంలో మార్పు ఉండకపోవచ్చు. జో బైడెన్‌ రాక అమెరికాలో ఉంటున్న లక్ష మంది భారతీయులకు పెద్ద ఊరట. ట్రంప్‌ అనుసరించిన కఠినమైన వలస విధానాన్ని సమూలంగా మార్చేయనున్నట్లు బైడెన్‌  చెబుతున్నారు.దేశంలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించిన 11 లక్షల మందికి ఎనిమిదేళ్లలో  పౌరసత్వం ఇచ్చే చర్యలను ఆయన చేపట్టనున్నట్లు, తొలి వందరోజుల్లోనే ఇందుకు సంబంధించిన కార్యాచరణను ప్రకటించనున్నట్లు బైడెన్‌ సన్నిహిత వర్గాలు తెలిపాయి.  అమెరికాలో చట్టవిరుద్ధంగా ఉంటున్న వారికి ఐదేళ్లపాటు తాత్కాలిక చట్టబద్ధత ఇస్తారు. అయితే వీరు ఈ జనవరి 1నాటికి అన్ని పన్నులు  కడుతూ, ఇతరత్రా అవసరమైన కనీస  నిబంధనలను పాటించిన వారై ఉండాలి. మిగిలిన మూడేళ్లలో గ్రీన్‌కార్డు ఇచ్చే పక్రియ ఉంటుంది. ఈ బిల్లు రూపకల్పన  ఇప్పటికే జరిగిందని అంటున్నారు. ఇకపోతే అమెరికా చరిత్రలో గత 90 ఏళ్లలో చూడనంత సంక్షోభ పరిస్థితుల మధ్య బైడెన్‌ దేశాధ్యక్ష పదవి చేపట్టారు. ట్రంప్‌కు ఆయనకు ఎంతో తేడా ఉంది. ట్రంప్‌ది దూకుడు వ్యవహారమైతే..  బైడెన్‌ సాత్వికుడు. సహజంగా లిబరల్‌గా పేరుంది. బైడెన్‌ ముందున్నది పూలబాట కాదు. గత వందేళ్లలో ఎన్నడూ చూడనంత వైద్య ఆరోగ్య అత్యవసర పరిస్థితిని అమెరికా ఎదుర్కొంటోది. రోజుకు 4వేల మంది చనిపోవడం, ఇప్పటికే మరణించిన వారి సంఖ్య 4 లక్షలకు చేరుకోవడంతో బైడెన్‌ దీనిని తన ప్రథమ ప్రాధాన్యంగా ఎంచుకున్నారు.  కొవిడ్‌ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ కకలవికలమైపోయింది. లక్ష కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీల వల్ల పరిస్థితి మరింతగా దిగజారింది. వీటికి తోడు దేశవ్యాప్తంగా వేల మంది ఉద్యోగాలు  కోల్పోయారు. దీన్ని పునరుద్ధరించడం బైడెన్‌కు కత్తి విూద సామే. 1861 అంతర్యుద్ధం తరువాత అమెరికన్‌ సమాజం నిట్ట నిలువుగా చీలిపోయింది. దీనికి ట్రంప్‌ ఆజ్యం పోశారు. ఈ చీలికను మళ్లీ పూడ్చి దేశాన్ని ఏకం చేయడం బైడెన్‌ ముందున్న అతి పెద్ద సవాలు. అందుకే ఆయన ’అమెరికా యునైటెడ్‌ ’ అన్న నినాదాన్ని చేపడుతున్నట్లు ప్రకటించారు. ట్రంప్‌ అనుసరించిన విదేశాంగ విధానం వల్ల ఓ రకంగా ప్రపంచ నేతగా ఏళ్ల తరబడి ఉన్న గుర్తింపును అమెరికా కోల్పోయింది. దీన్ని సరిదిద్దుతానని బైడెన్‌ ఇప్పటికే ప్రకటించారు. విస్తరణవాదంతో నానాటికీ రెచ్చిపోతున్న చైనాకు ఆయన ఎంతవరకూ క్లళెం వేస్తారన్నది చూడాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు