Hot Posts

6/recent/ticker-posts

చివరి అవకాశం 4 వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయండి


తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు సూచన

ఎల్‌ఆర్‌ఎస్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌,జనవరి25(ఉదయ కిరణాలు): ఎల్‌ఆర్‌ఎస్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉందని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ల నిలిపివేత, ఎల్‌ఆర్‌ఎస్‌ వేర్వేరు అని పిటిషనర్‌ తరపు లాయర్‌ తెలిపారు. పూర్తి వివరాలతో కౌంటర్‌ వేస్తామని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. కౌంటర్‌ దాఖలుకు ప్రభుత్వానికి హైకోర్టు చివరి అవకాశం ఇచ్చింది. 4 వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను జూన్‌ 15కి హైకోర్టు వాయిదా వేసింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు