Hot Posts

6/recent/ticker-posts

నగరంలో మందు బాబుల హల్ చల్ పాత నగరంలో నో సోషల్ డిస్టెన్స్ ( సాంఘిక దూరం తెలియదు భయ్యా )

 రాష్ట్రం లోని వైన్ షాప్ ల ముందు బారులు తీరి కనపడిన మందుబాబులు 


ఉదయ కిరణాలు : 6 మే
మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే మాకు మేమె మహారాజులం అన్న సినిమా పాట ఈ రోజు అన్ని వ్యాట్సాప్, పేస్ బుక్ గ్రూప్  లతో పాటు సోషల్ మీడియాలో  చిందులు వేస్తుంది. ఎందుకు వేయదు మరి తెలంగాణ లోని అన్ని నగరాల్లో పరిస్థితి చూస్తే ఇలాగే అనిపించింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది.ఎటుచూసినా వైన్ షాప్ ల ముందు మందు బాబుల జాతర కనిపించింది.తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాప్ లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో మందు బాబుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఎప్పుడు తెల్లారుతుందా? ఎప్పుడు వెళ్లి వైన్ షాప్ ల ముందు నిలబడదామా? అన్నట్లు కనిపించింది ఈరోజు వాతావరణం.  వైన్ షాప్ లు తెరవక ముందే కొన్ని చోట్ల మందుబాబులు ఠికానా వేసుకొని కూర్చున్నారు. ఉదయాన్నే నిద్రలేవగానే పోయుంటారు  కాబోలు ? ఎన్నో సంవత్సరాలుగా వేచి ఉన్న ప్రాణాల్లా వైన్ షాపుల ముందు క్యూ కట్టారు. తీరా దుకాణాలు తెరుచుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేనట్లు అనిపించింది. దాహం దాహం అన్న చందంగా నీటి కోసం కొట్టుకున్న ప్రాణాల్లా మందు  కోసం ఊవిళ్లూరాయి. అంతే కాదు ముందు నేను అంటే నేను అన్నట్లు తయారయింది వీరి పరిస్థితి.  అప్పట్లో కొత్త సినిమా వస్తే ఫర్స్ట్ షో సినిమా చూసినంత ఆనందం వచ్చినట్లు మందు నాకే ముందు దొరికిందని గంతులు కూడా వేశారంటే అతిశయోక్తి కలుగక మానదు. మొత్తం మీద వీళ్లు ఏదో గనకార్యం సాధించినట్లు తయారయ్యింది.వీరి తీరు. సినిమాల్లో అయితే టిక్కెట్లు అయిపోతాయి ఇక్కడ ఎం అయిపోతుంది అని వీళ్లు ఇలా తయారయ్యారు. రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ సూచనలు చేసినప్పటికీ  వైన్ షాపుల దగ్గర గుమిగూడ వద్దు. రోజులో 9గంటలు షాపులు తెరిచే ఉంటాయని చెప్పినా వినలేదు. కనీసం సాంఘిక దూరాన్ని కూడా వీరు పాటించలేదు. విలేకరులకు నిన్నటి మీటింగ్ లోనే ఏదైనా షాప్ దగ్గర సోషల్ డిస్టెన్స్ పాటించని దుకాణాల దగ్గరి వీడియోలు తీసి తనకు పోస్ట్ చేస్తే అప్పటికప్పుడే అట్టి దుకాణము యొక్క లైసెన్స్ ను రద్దు చేస్తానని చెప్పిన కేసీఆర్ సార్ కు మరి ఈరోజు ఎంతమంది పోటోలు, వీడియోలు పెట్టారో తెలియదు కానీ ఈరోజు ఓపెన్ చేసిన దాదాపు అన్ని వైన్ షాపుల దగ్గర సాంఘిక దూరం లేకుండానే మద్యం అమ్మకాలు కొనసాగాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోనే అన్ని వైన్ షాప్ ల ముందు మందు బాబులు కిక్కిరిసి కనిపించారు. అసలు సాంఘిక దూరం కాదు కదా బహ బహి పరిస్తితుల్లో మందు కొనడానికి మందు బాబులు ప్రయత్నించారు. దుకాణం దారులు కూడా ఎలాంటి నియమాలు పాటించకుండానే మద్యం అమ్మకాలు జరిపారు. కొన్ని ప్రాంతాల్లోనైతే కావాలని తక్కువ ధర కలిగిన మద్యం నిలువలు లేవని మద్యం దుకాణం దారులు తెలిపారు సందులో సడేమియా అంటూ ఎక్కువ మొత్తంలో మందు బాబుల నుంచి డబ్బులు రాబట్టే ప్రయత్నమే చేసారు తప్ప సోషల్ డిస్టెన్స్ తో మాకేంటి అని మద్యం అమ్మకం దారులు ఎవడెక్కడ పొతే మాకేంటి అన్న మాటలు వినిపించాయి. వాళ్లు రూల్స్ పాటించక పొతే మేమేం చేయాలి అన్న పరిస్థితులు తలపించేలా చేశారు మద్యం అమ్మకం దారులు ఈ బ్రాండ్ ఉంది ఇదిలేదు అంటూ ఒకటే ఇస్తాం ఎక్కువ ఇవ్వం తీసుకుంటే తీసుకో లేకుంటే లేదు అనే సమాధానాలు కూడా రాకపోలేదు ఇదేమని తిరగ బడి అడిగిన మందు బాబుల ను ఈడ్చి పారేసిన సందర్భాలు ఉన్నాయి. తాగుబోతు సచ్చినోళ్ళు వాళ్ళు ఏమంటే దానికి పడ్డారు. దొంగ నా కొడుకులకు మందు కావలి కదా ఎం చేస్తారు మరి. మందు కోసం ఎంతకైనా దిగజారుతారు వెధవలు నగరంలో ఎక్కడ చూసిన ఈరోజు మందు బాబుల టాపిక్ లే వినిపించాయి. అంత ఎత్తుకు ఎదిగారు మరి ఈ మహానుభావులు అసలు మందు దుకాణాలకు ప్రభుత్వం  పర్మిషన్ ఇచ్చి మంచి చేసిందా లేక ఆదాయం ఇప్పట్లో కావాలని తొందర పడిందా ?ఇంకొంత  కాలం వేచి ఉంటె బాగుండేది కదా? అన్న మాటలు ఈ రోజు ప్రజల మనసుల్లో నుంచి బయట పడ్డాయి. హైదరాబాద్ నగరంలో నైతే పరిస్థితి మరీ దారుణంగా తయారయ్యింది.  రోడ్డుపై వెళుతున్న వారి మీద పడేలా మందు బాబులు షికార్లు కొట్టారు. మందుబాబుల  వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచిందని అనేక మంది జనాలు వాపోయారు. మూతికి గుడ్డ కట్టుకొని రోడ్లపై బిక్కు బిక్కు మంటూ దూరం నుంచి వెళుతున్న ఉద్యోగుల పై కూడా లైన్లలో నిలుచున్నా మందు బాబులు రోడ్లపై హల్ చల్  చేస్తూ రోడ్లపై వెళుతున్న వారి మీద మీద పడ్డ సందర్భాలు ఉన్నాయి. పాతనగరంలో నైతే పరిస్థితి మరీ దారునంగా కనిపించింది. ఇన్నాళ్లు ప్రజలకు ఫీడ్ ది నీడి ఇవ్వకుండా తలదాచుకున్న కొందరు చోట మోట నాయకులు మందు దుకాణాల దగ్గరకు వచ్చి ఎదో ఘనకార్యం చేస్తున్నట్లు నిలుచున్నారు. కనీసం అక్కడైనా సోషల్ డిస్టెన్స్ పాటించని వారిని బెదిరించి వారిని ఒక క్రమ పద్ధతిలో నిలబడేలా చేస్తారేమో అనుకుంటే సినిమా చూడడానికి వచ్చినట్లు వైన్ షాప్ ల ముందు నిలుచున్నారు. బహుశా మద్యం దుకాణం దారులతో మామూలు కోసం వచ్చారో పోలీసులు ఏమి అనకుండా చూసుకుంటామని ఉన్నారో తెలియదు కానీ ఆకలితో జనాలు అలమటిస్తున్న సందర్భాల్లో రాని చోట మోట షకీల్ గాళ్లు మాత్రం మద్యం దుకాణాల దగ్గర మోటబారైతే చేశారు .ఇగ ఇలా కొనసాగింది ఈరోజు మద్యం గొడవ  రేపు పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే మరి. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు