Hot Posts

6/recent/ticker-posts

మద్యం ముందు కరోనా భయం అంతంత మాత్రమే? మరీ ఇంత దూకుడెందుకు ?

మరీ ఇంత దూకుడెందుకు ?



మద్యం ముందు కరోనా భయం అంతంత మాత్రమే అని ప్రజలు  మరోమారు నిరూపించారు. పాక్షిక సడలింపులకే ప్రజలు  ఇంట్లోనుంచి బంధనాలు  తెంచుకుని..బయటకు వస్తున్న తీరు ఆందోళనలకు గురిచేస్తోంది. మద్యం కోసం ప్రజలు  చీమల దండులా  బజార్లకు రావడం దేశవ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తోంది. కరోనా వ్యాప్తి జరుగుతుందన్న భయం ప్రజల్లో ఎక్కడా కానరావడం లేదు. ఉదయం నుంచే మద్యం షాపుల  ముందు మందుబాబులు  క్యూ కట్టడం చూస్తుంటే వారు ఎంతగా మొహం వాచి ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే కొన్నిచోట్ల పనులకు అవకాశం కల్పించడంతో అక్కడా ప్రజలు  గుంపులుగా బయటకు వచ్చారు. అహ్మదాబాద్‌ లాంటి నగరాల్లో ప్రజలు  రోడ్లపై వాహనాలతో క్యూ కట్టారు. ఇది ఎంతవరకు దారితీస్తుందో ఇప్పుడే చెప్పలేం. మద్యం దుకాణాలకు అనుమతులతో పాటు  దీంతో పాటు వివిధ రాష్ట్రాలు  కూడా ఆంక్షల్లో పలు  సడలింపుల  నిచ్చాయి. తమిళనాడు, కేరళ, ఒడిశా, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, ఢిల్లీ , హిమాచల్‌ ప్రదేశ్‌, సిక్కిం, అసోం తదితర రాష్ట్రాలు  ఆంక్షలు  సడలించడంతో ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్ల పరిధిలోని క్షౌరశాలలు , ఎక్ట్రికల్‌ దుకాణాలు ,స్టేషనరీ, ఆటోమొబైల్‌ షాపులు  సోమవారం తెరుచు కున్నాయి. దీంతో వినియోగదారులు  పెద్దఎత్తున కొనుగోళ్లు జరిపారు. అయితే భయమల్లా ఎవరు కూడా పెద్దగా సామాజిక దూరం పట్టించుకోక పోవడమే. మార్కెట్లోకి దూసుకుని వస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. రెడ్‌జోన్‌ బయట ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లోని ఉద్యోగులు  విధులకు హాజరయ్యారు. ఆరెంజ్‌, గ్రీన్‌ జోన్ల పరిధిలో తిరిగేందుకు ప్రైవేటు వాహనాలకు అనుమతునివ్వడంతో పెద్దమొత్తంలో వాహనాలు  రోడ్లపైకి వచ్చాయి. కరోనా కట్టడికి ఇప్పటి వరకు బలవంతపు  క్రమశిక్షణతో గడిపిన జనం.. ఒక్కసారిగా కట్టు తప్పారు. భౌతిక దూరం నిబంధనలను పక్కనబెట్టారు. గుంపుగా చేరి గొడవకు దిగారు. వారిని దారిలోకి తెచ్చేందుకు పోలీసు రంగంలోకి దిగాల్సి వచ్చింది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌తో మూతపడిన మద్యం దుకాణాలు  40 రోజు తర్వాత తిరిగి సోమవారం తెరుచు కోవడంతో చాలా రాష్ట్రాల్లో కనిపించిన దృశ్యాలివీ..! మూడో విడత లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు  పొడిగించిన కేంద్రం మద్యం దుకాణాలు  తదితరాలకు గ్రీన్‌జోన్లలో వెసులుబాటు నిచ్చింది. షాపు వద్ద కొనుగోలు  దారులకు  ఆరడుగుల  భౌతిక దూరం పాటించాలనీ, ఐదుగురికి మించి ఉండరాదని నిబంధనలు  పెట్టింది. అయినా అవేవిూ పాటించ కుండా ఎవరికి వారు ముందుకు వచ్చారు. ఢిల్లీలో  ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మద్యం దుకాణాల  వద్ద ఉదయం నుంచే జనం కిలోవిూటర్ల కొద్దీ క్యూలు  కట్టారు. మద్యం కొనుగోలు కు ఎగబడ్డారు. భౌతిక దూరం పాటించకపోవడంతో నిర్వాహకులు  దుకాణాలను మూసివేశారు. పోలీసులు  లాఠీచార్జీ చేసి మందుబాబులను అదుపు చేయాల్సి వచ్చిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఢిల్లీలోని  సుమారు 150 మద్యం దుకాణాలు  సోమవారం ఉదయం 9 నుంచి సాయంత్రం 6.30 గంట వరకు పనిచేశాయి. ఉత్తరప్రదేశ్‌ వ్యాప్తంగా 26 వేల  మద్యం దుకాణాలు  తెరుచుకున్నాయి. మద్యం ప్రియులు  పలు రాష్ట్రాల్లో  లిక్కర్‌ కోసం బాహాబాహీకి దిగారు. మొదటి రోజు విక్రయాలతో రూ.100 కోట్ల ఆదాయం వచ్చిందని యూపీ ప్రభుత్వం తెలిపింది. ఇకపోతే కంటైన్‌మెంట్‌ ప్రాంతాలుగా లేని  చోట్ల మద్యం దుకాణాలను తెరుస్తామంటూ మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో సోమవారం ముంబై, పుణెళిల్లోని షాపు వద్ద కొనుగోలు  దారులు  క్యూ కట్టారు. కానీ, దుకాణాలను తెరవకపోవడంతో నిరాశచెందారు. షాపును మూసి ఉంచాలంటూ తాము ఉత్తర్వులు  ఇవ్వలేదని అధికారులు  తెలిపారు. కర్ణాటకలోని బెంగళూరు తదితర ప్రాంతాల్లో జనం భారీగా చేరడంతో నిర్వాహకులు  దుకాణాలను మూసివేయాల్సి వచ్చింది. కోవిడ్‌ వ్యాప్తికి ఊతమిచ్చేలా జనం గుమికూడు తున్నందున ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం సవిూక్షించాలని పు రాజకీయ పార్టీలు  కోరాయి. ఇక ఎపిలో అయితే భారీగా మద్యం ధరలు  పెంచారు. ఎందుకని అడక్కముందే మద్య నిషేధంలో ఓ భాగమని ప్రభుత్వం ధరల  పెంపును సమర్థించుకుంది. మద్యం దుకాణాలు  తెరవడంపై సామాజిక మాధ్యమాల్లో అప్పుడే సెటైర్లు మొదయ్యాయి. గంటలు  మోగించారు...దీపాలు  వెలిగించారు...పూలు  చల్లారు...ఇకపై తీర్థం అందుబాటు లోకి తెచ్చారంటూ పోస్టులు  పెడుతున్నారు. మద్యం షాపు ముందు ప్రజలు  భారీగా క్యూ కట్టడంతో ఇది కరోనా వ్యాప్తికి దారితీస్తుందన్న భయం వెన్నాడుతోంది. కరోనా మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో మద్యం అమ్మకాలపై పునరాలోచన చేయాలని ఆయా పార్టీల  నేతలు  సూచించారు. ప్రజల  ఆరోగ్యాన్ని పణంగా పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం కోసం తాపత్రయపడుతోందని విమర్శించారు. మద్యం షాపుల  వద్ద లాక్‌డౌన్‌ నిబంధను ఉల్లంఘించి, వ్యక్తిగత దూరం గాని కనీసం మాస్కు కూడా లేకుండా మందు బాబులు  బారులు  తీరి లైన్లో నిల్చుంటున్నారు. ఇకపోతే  దేశవ్యాప్తంగా పోలీసు బందోబస్తు మధ్య మద్యం అమ్మకాలు  సాగించాల్సిన దుస్థితి నెలకొంది. ఇకపోతే  కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు  భారీగా నమోదైన తమిళనాడులో ఈ నెల 7వ తేదీ నుంచి మద్యం దుకాణాలు  తెరచుకోబోతున్నాయి. గ్రీన్‌జోన్‌ ప్రాంతాలు, నాన్‌ కంటైన్‌మెంట్‌ క్లస్టర్లలో మద్యం అమ్మకాలకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఒక వంక పాజిటివ్‌ కేసులు  భారీగా నమోదవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మద్యం అమ్మకాలను పునరుద్ధరించడం వల్ల  పరిస్థితులు  అదుపు తప్పుతాయనే ఆందోళనలు  వ్యక్తమౌతున్నప్పటికీ.. ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. ఆదాయ వనరును మెరుగుపర్చుకోవడంలో భాగంగా మద్యం దుకాణాలను తెరవాల్సి వస్తోందని ప్రభుత్వం చెబుతోంది. అన్ని ప్రభుత్వాల  వాదనా ఇదే పద్దతిలో ఉంది. లాక్‌డౌన్‌తో ఆదాయం కోల్పోయిన ప్రభుత్వాలు  ఇప్పుడు మద్యం ద్వారా తక్షణ ఆదాయం కోసం వెంపర్లాడుతున్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు