బ్రతుకు దెరువు భారమయ్యేనా ? ప్రజలను వెన్నాడుతున్న భయాలు
ఉదయ కిరణాలు : 4 మే
లాక్‌డౌన్ మరో రెండు వారాలు పొడిగిస్తూ హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చాక ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారని ప్రచారం జరిగింది. ప్రజలంతా ఏమి చెబుతారో అని ఆశగా చూశారు. కానీ ప్రధాని ఎలాంటి సందేశం ఇవ్వలేదు. సరికదా అనేక సందేహాలు ప్రజలను గందరగోళంలోకి నెడుతున్నాయి. ప్రజలంతా ఇప్పటివరకు ప్రభుత్వాలు చెప్పినట్లుగా లాక్‌డౌన్ పాటిస్తూ ఇంటికి పరిమితం అయ్యారు. జన్‌ధన్ ఖాతాలు లేకున్నా, ప్రభుత్వాలు సాయం చేయకున్నా బిక్కుబిక్కుమంటూ మధ్య తరగతి, ఇతర తరగతుల వారు భవిష్యత్‌పై బెంగతో కూర్చున్నారు. తమకు ఎలాంటి సాయం అందుతుందో అన్న ఆశతో ఉన్నారు. ఈ తరతగతులకు ఎలాంటి ఊరడింపు వస్తుందో అని ఎదురుచూశారు. వివిధ వర్గాలు , రంగాల ప్రముఖులు , ఆర్థికరంగ నిపుణులతో ప్రధాని చర్చిస్తున్నారు. ఈ దశలో లాక్‌డౌన్ మరో రెండు వారాలు పొడిగిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. ప్రధాని మళ్లీ ప్రకటన ద్వారా ఊరడింపు కు చెబుతారనుకున్న వారికి నిరాశే ఎదురయ్యింది. దాదాపు రెండు నెలల పాటు లాక్‌డౌన్ కారణంగా వస్తూత్పత్తి పోయింది. ఉద్యోగాలు పోయిన వారు కొందరు..ఉద్యోగాలు లేని వారు మరికొందరు.. ఉద్యోగాలు లేక స్వయం ఉపాధితో పొట్టపోసుకునే వారు కొందరు..ఇలా వివిధ రంగాల వారు ఉన్నారు. వారంతా తమ భవిష్యత్‌పై ఆశలు చచ్చి బతుకుతున్నారు. వీరందరిని ఎలా ఆదుకోబోతున్నారో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఎలాంటి హావిూ ఇవ్వడం లేదు. లాక్‌డౌన్ ఎంతకాలం ఉంటుందో తెలియదు. ఎలా ముందుకు తీసుకుని వెళతారో తెలియదు. గత నెలాఖరున అమల్లోకి తెచ్చిన లాక్‌డౌన్ గడువు ముగిసే తరుణంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించి దాన్ని వచ్చే నెల 3 వరకూ పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. ఈ క్లిష్ట సమయంలో దేశ ప్రజానీకమంతా పాటించాల్సిన ఏడు అంశాను కూడా ఆయన ప్రస్తావించారు. కరోనా మహమ్మారి తీవ్రత ఆశించిన స్థాయిలో తగ్గిన దాఖలాలు లేకపోవడంతో లాక్‌డౌన్ పొడిగింపే ఉత్తమమని ప్రకటించారు. దాదాపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఇదే అభిప్రాయం వెల్లడించారు. అదే సమయంలో వ్యవసాయం, ఆక్వా, ఉద్యానపెంట దిగుబడులు రవాణా, వాటి మార్కెటింగ్, పారిశ్రామిక రంగం తదితరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. చాలా దేశాలతో పోలిస్తే మన దేశంలో లాక్‌డౌన్ అమలు తీరు ఎంతో మెరుగ్గా ఉందని ప్రధాని మోదీ చెప్పిన మాటల్లో వాస్తవముంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా కరోనా ఆశించినంతగా తగ్గటం లేదు. దీన్ని కట్టడి చేయడం సామాన్యమైన విషయం కాదని, ఇప్పటికిప్పుడు ఇది కంట్రోల్ కాదని అంటున్నారు. పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఆందోళనకర స్థాయికి చేరుతోందని గణాంకాలు గమనిస్తే తెలుస్తుంది. వైద్యులు , ఇతర సిబ్బంది అలుపెరగని రీతిలో శ్రమిస్తున్నారు. ఆ మహమ్మారిని అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వనరుల కొరత ఎంతగా వేధిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కరోనా వ్యాధి పైనే తమ సర్వశక్తులూ కేంద్రీకరించి, దాని కట్టడికి అధిక ప్రాధాన్యమిచ్చి పనిచేస్తున్నాయి. దీన్ని మరింత కాలం ఇదే స్థాయిలో కొనసాగిస్తే తప్ప నిరోధించడం అసాధ్యమని గమనించి మరో రెండువారాలు పొడిగించారు. అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి. కరోనా మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇంకా గుర్తించడం కష్టంగా మారింది. టెస్ట్ కిట్లు అందుబాటులో లేకపోవడం వల్ల టెస్ట్ చేయడం సాధ్యం కావడం లేదు. కరోనా కట్టడి వ్యూహంలో అదే పెద్ద సమస్యగా మారింది. మొత్తంగా ఇప్పుడు లాక్‌డౌన్ పొడిగిస్తూ పోవడం వల్ల సాగురంగం సంక్షోభంలో పడటం, ప్లలెసీమల్లో ఉపాధి లేకపోవడం పర్యవసానంగా అనేకులు పనిచేసేందుకు నగరాలను, పట్టణాలను ఆశ్రయిస్తూ వచ్చారు. వీరంతా ఇప్పుడు రోడ్డున పడ్డారు. ఆయా రంగాల్లో రిజిస్టరయిన కార్మికుల సంఖ్య అన్ని రాష్టాల్లోన్రూ తక్కువే వుంది. ఇతర అసంఘటిత రంగాల్లోనూ ఇదే స్థితి నెలకొంది.ఈ దశలో నగరాల్లో ఇంతకాలం పొట్టపోసుకున్న లక్షలాది మంది తమకు ఆకలిచావులు తప్పవన్న భయాందోళనతో స్వస్థలాలకు నడుచు కుంటూ వెళ్లారు. వారిని తరలించే ప్రయత్నాలకు కేంద్రం అనుమతించింది. అయితే వీరంతా సొంతూళ్లకు వెళ్లినా అక్కడా వారికి ఎలాంటి ఉపాధి కల్పించబోతున్నారో చెప్పడం లేదు. ఉద్యోగాలు కోల్పోయి, ఉపాధి దక్కక రోడ్డున పడ్డవారిని ఎలా అక్కున చేర్చుకుంటారో తెలియడం లేదు. ఆర్థికరంగ నిపుణులతో జరిగిన చర్చ తరవాత ప్రధాని మోడీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియడం లేదు. ఇప్పుడు ప్రభుత్వాలన్నీ ప్రధానంగా కరోనా బారిన పడ్డ ప్రజల ఆరోగ్య పరిరక్షణపైనే దృష్టి కేంద్రీకరించివున్నాయి. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయినవారి కోసం చర్యలు తీసుకుంటున్నా అవి ఎక్కడా సరిపోవడం లేదు. దశాబ్దాలుగా అసంఘటిత రంగ కార్మికుల స్థితిగతులెలా వున్నాయో, వారిలో అందరూ నమోదవుతున్నారో లేదో ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల హఠాత్తుగా వచ్చిపడిన ఈ సంక్షోభంలో అందరికీ సాయం అందించడం సమస్యగా మారింది. లాక్ డౌన్ మున్ముందు మరింత కఠినం అయితే ప్రజలు తట్టుకోగలరా ఆలోచించాలి. ప్రజలు చావుకైనా తెగిస్తారు కానీ.. బతకడం భారం అయితే తట్టుకోలేరు. ఆకలిచావులు లేకుండా చేయాల్సి ఉంది.ఆహార పదార్థాల సరఫరాకు ఆటంకం లేకుండా చూడటం, ఇతరత్రా అవసరాల కోసం నిరుపేద వర్గాలకు నగదు బదిలీ చేయడం వంటివి ఎంత అవసరమో... వివిధ వర్గాలకు ఎలాంటి సాయం అందించబోతున్నారో స్పష్టత రావాల్సి ఉంది. అందువల్ల ప్రజల్లో మరింత గందరగోళం చెలరేగకుండా ఆయా వర్గాలకు ఊరటనిచ్చే పతకాలు సాగాలి. ప్రణాళికలు చేయాలి. ఆదుకునే చర్యలు ఉండాలి. అప్పుడే ప్రజలకు స్వాంతన చేకూరుతుంది.
-------------------------
Is life burdensome? Fear of pursuing people
Morning rays: 4 May
After the lockdown was extended for another two weeks, Prime Minister Modi was said to be addressing the race after the Home Ministry issued orders. People looked at what they had to say. But the Prime Minister gave no message. There are many doubts that confuse people. People have been confined to the house following the lockdown, as the governments have said so far. The middle class and other classes are anxious about the future, as there are no Janthan accounts and governments are not helping. They are hoping for help. These generations were expecting a concession. The Prime Minister has been discussing with various sources, industry figures and financial experts. At this stage, the lockdown was extended by another two weeks. The Prime Minister was again disappointed by the announcement. Production was lost due to lockdown for about two months. There are some people who are out of jobs, some who are unemployed, others who are not getting jobs or self-employment. They are hoping for their future. The central and state governments are not giving any idea how to support them. It is not known how long the lockdown will last. Don't know how to proceed. Prime Minister Narendra Modi addressed the race and announced that it would extend it till next month. He also referred to seven issues that the entire masses of the country must follow at this critical time. In the absence of the expected filing, the lockdown was announced as the best time to extend the coronary epidemic. Almost all the chief ministers expressed their views in a video conference with the Prime Minister. At the same time it is suggested to look at agriculture, aqua, horticulture, transportation, their marketing and industrial sectors. The reality of Prime Minister Modi's words is that the implementation of lockdown in our country is much better compared to many other countries. However, no matter how many precautions Corona is expecting, it does not go down. Strictly speaking, it is not a common thing to say that it is out of control. The number of positive cases is on the rise. Statistics show that the level of anxiety is rising. Doctors and other staff are working hard. Trying to contain that pandemic. The scarcity of resources is so overwhelming that the state governments are concentrating all their energies on coronary disease and putting a high priority on its control. This was extended for another two weeks, as it was found to be impossible to prevent unless it continued for the same length of time. One thing to note here though. It is difficult to determine where the corona roots are yet. Test kits are not available and cannot be tested. Corona has become the same big problem in tightening strategy. With the extension of the lockdown as a whole, many people have come to the cities and towns to work as a result of the irrigation crisis and the lack of employment in Pleasimal. They all hit the road now. The number of registered workers in the respective sectors is the lowest in all states. Millions of hunger strikers in the city have been forced to flee their homes in fear of starvation. The center has allowed them to move. However, they are not going to go to their hometowns and give them any employment. It is not known how to get jobs and those who are on the road to employment. Prime Minister Modi is unaware of what decisions will be taken after discussions with financial experts. Governments are now focusing primarily on the health care of coronally ill people. There is nowhere near enough action for those who have lost their jobs with the lockdown. Governments do not care about the status of unorganized sector workers for decades and whether or not all of them are registered, which has suddenly become a problem for all. Before the lockdown is more stringent, people should be able to tolerate it. People die but die .. But the burden of sacrificing is not tolerated. There is no need to hunger. The need to look at the supply of food and the need to transfer money to the needy for other purposes ... There is a need for clarity on how to help the various communities. Therefore, there should be a lot of confusion among the people, the medals that should be given to the communities. Plans must be made. There must be activities to help. It is then that the people are free.

0 కామెంట్‌లు