Hot Posts

6/recent/ticker-posts

లాక్ డౌన్ ఆశయం ఫలించేనా ?

లాక్ డౌన్  ఆశయం ఫలించేనా ?

ఉదయ కిరణాలు : 3 మే
 

ప్రపంచ వ్యాప్తంగా దడ పుట్టిస్తున్న కరోనా మహమ్మారి మూలంగా ఏర్పడిన సంక్షోభం ప్రపంచ దేశాలన్నింటినీ అతలా  కుతలం చేసింది. ఇక ఈ తరుణంలో ఏర్పడిన లాక్ డౌన్ మనుషులందరినీ బందీలను చేసింది. జంతు ప్రదర్శన శాలలో జంతువులను బందీలుగా చేసి ప్రదర్శనకు ఉంచినట్లు మనుష్యులందరిని కరోనా అనే ఒక మహమ్మారి అందరిని బందీలుగా మార్చిందంటే  అతిశయోక్తి కలుగక మానదు. ఎందుకంటే కరోనా వైరస్ కోవిడ్ -19 గ పిలువబడే ఈ వైరస్ అత్యంత వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. దీంతో లాక్ డౌన్ ఒక సరైన మార్గమని భావించిన ప్రపంచ దేశాల నిపుణులు లాక్ డౌన్ పాటించడమే దీనిని కట్టడి చేయడంతో పాటు వ్యాప్తి చెందకుండా అరికట్ట గలమని అంచనా వేశారు.దీంతో ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ దిశగా ముందుకెళ్లారు. దీంతో జనజీవనం పూర్తిగా స్థంభించింది.మనుష్యులంతా ఎక్కడికక్కడ గప్ చుప్ అన్నట్లుగానే ఉండిపోయారు. ప్రపంచ దేశాలన్నీ లాక్ డౌన్ కే  మొదటి ప్రాధాన్యతనిచ్చాయి. ఇక భారత దేశ విషయానికొస్తే ఇండియాలో వ్యాధి తీవ్రత ఏర్పడక ముందే పరిస్థితులను పసిగట్టిన భారత ప్రభుత్వం - ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు దేశంలో కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ ను ప్రకటించింది. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూ పేరుతో ప్రజలకు ఇచ్చిన పిలుపు మేరకు ఇండియా  మొత్తంలో అత్యంత పెద్ద ఎత్తున స్పందన లభించింది. దాని వెనకాలే లాక్ డౌన్ మొదలు కావడంతో అసలు కథ అక్కడి నుంచే మొదలయ్యింది. లాక్ డౌన్ తో జన జీవనమంతా ఎక్కడి కక్కడ స్థంభించి పోయింది. ఒక రోజు కర్ఫ్యూ  అనుకున్న ప్రజలకు లాక్ డౌన్ అనే ప్రతి పాదన కొత్తగా అనిపించింది. విదేశాల నుంచి వచ్చే సర్వీసులన్నీ రద్దయ్యాయి. మొదటి దశలో విదేశాల్లో  ఉన్న కొందరు భారతీయులను దేశానికి రప్పించ గలిగిన భారత ప్రభుత్వం తదననంతరం ఏర్పడిన సంక్షోభంతో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పలేదు. దేశ సరి హద్దు లను విమాన సర్వీసులన్నీ రద్దు చేసింది. దీంతో పాటు నౌకా దళం ఇతర ఎలాంటి రాక పోకలకైనా అనుమతిని నిరాకరించింది భారత్. దేశమంతటా రైలు సర్వీసులు బంద్, బస్సులు బంద్, రవాణా వ్యవస్థ పూర్తిగా మూతబడ్డాయి.  తరువాత రాష్ట్రాల సరిహద్ద్దుల్లో ఆంక్షలు ఏర్పడ్డాయి.. ఎక్కడ  ఉన్న ప్రజలు అక్కడే ఉండాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. వలస కార్మికులు కూడా రాష్ట్రాలను వదిలి తమ స్వంత రాష్ట్రాలకు వెళ్లకుండా ఉండేలా ఆంక్షలు విధించారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీల భాద్యత ప్రస్తుతం వారుంటున్న రాష్ట్ర ప్రభుత్వాలే వారి స్థితి గతులను చూసుకోవాలని రాష్ట్రాలన్నీ నిబంధనలను ఏర్పరుచుకున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా వలస కార్మికుల ఆలనా పాలన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత తీసుకోవాల్సిందిగా వారికి కావలసిన సరుకులను అందించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఏ రాష్ట్రంలో ఉన్న మనుష్యులు అక్కడే ఉంది పోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని చోట్ల ఊర్లకు ఇతర కార్యకలాపాల నిమిత్తం వెళ్లిన జనాలు కూడా అక్కడే ఉండి  పోవాల్సిన విపత్కర పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని దశల్లో మా ఊరికి మేము వెళ్లి పోతాం ? మా స్వరాష్ట్రానికి మేము వెళ్లి పోతాం? అక్కడ మా కుటుంబ సభ్యులతోనే చావైనా ? బ్రతుకైనా?అంటూ వెళ్లిన వారికి కూడా ఎన్నో అగచాట్లు నరక యాతన తప్పలేదు. కొందరు కింద మీద పడి  కాలి  నడకతోనే తమ రాష్ట్ర సరిహద్దుల వరకు వెళ్లినా అక్కడ కూడా వారికి నిరాశే ఎదురయ్యింది. రాష్ట్రం, ఊరు ప్రాంతం వారిదే అయినా వాళ్ళ  ఇంటి వరకు పోవడానికి అనుమతి లేకుండా పోయింది. 14 రోజులు క్వారంటైన్  ల్లో ఉంటేనే తప్ప ఊళ్లోకి అడుగు పెట్టేది లేదు అని చివాట్లు పడ్డాయి. ఎందరో కాలి నడకతో తమ ఊళ్ళ వరకు చేరు కోవడం  లో ప్రాణాలను కూడా వదిలి వేశారు. అనేక కఠినమైన నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వాలు కొంచెం కఠినంగానే వ్యవహరించాయి. ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం అందరి అభిప్రాయాలతోనే ముందుకు వెళుతూ  వచ్చాయి. కానీ కరోనా కేసుల సంఖ్య  తగ్గినట్లే అనిపించినా, తబ్లీకి జమాత్ వల్ల  ఏర్పడ్డ సంక్షోభంతో అటు కేంద్ర ప్రభుత్వాన్ని ఇటు రాష్ట్ర ప్రభుత్వాలను ఇరకాటంలో పడవేశాయి. కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య ఎక్కువ అవుతుండడంతో జిల్లాల వారీగా ఉన్న సరిహద్ద్దులలో కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆంక్షల ధోరణిని కఠిన తరం చేస్తూ వచ్చాయి. అక్కడి నుంచి గ్రామాల వారీగా మనుష్యుల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. అయినప్పటికీ కరోనా తీవ్రత ఉన్న రాష్ట్రాల్లో పరిస్థితి అదుపులో ఉన్నట్లే ఉంటూ చేజారుతుండటం ప్రభుత్వాలను ఇరకాటంలో పడవేసింది. ఒక్క కేరళ ప్రభుత్వం తప్పితే దాదాపుగా కరోనాతో సతమతమవుతున్న అన్ని రాష్ట్రాలు ఇబ్బందుల తీవ్రతను ఎదుర్కోక తప్పడం లేదు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత దేశంలో కరోనా తీవ్రత అంతగా లేక పోయినప్పటికీ దానిని కట్టడి చేయడంలో అటు కేంద్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కరోనా రోగుల కోసం పోరాడుతున్న డాక్టర్లు ,పోలీసులు,పారిశుద్ద కార్మికులు,అత్యవసర సర్వీసుల ఉద్యోగులతో పాటు సామాన్య జనాలు కూడా కరోనా మహమ్మారి తో యుద్ధం చేస్తూనే ఉన్నారు. కనీసం ఈ దఫా భారత ప్రభుత్వం కరోనాను పారద్రోలడానికి విధించిన లాక్ డౌన్ వరకైనా కరోనా లేని దేశంగా భారత్ నిలవాలని లాక్ డౌన్ ఆశయం నెరవేరాలని జన జీవనం సాధారణ స్థితికి చేరుకోవాలని కోరుకుంటూ …                        
  'సాహిత్య భుజేందర్ బాబు    
---------------------------

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు