Hot Posts

6/recent/ticker-posts

దేశంలో వ్యవసాయం ద్వారా ఉపాధిని పెంచాలి

దేశంలో వ్యవసాయం ద్వారా ఉపాధిని పెంచాలి

 ఉదయ కిరణాలు ప్రత్యేక ప్రతినిధి , హైదరాబాద్ 
 దేశంలో లాక్‌డౌన్‌ కారణంగా అన్ని రంగాలు  కుదేలయ్యాయి. ఆర్థికంగా దెబ్బతిన్నాయి. దేశంలో నిరుద్యోగ సమస్య గతంలో ఎన్నడూ లేనంతగా పెరుగుతోంది. ఇదే సమయంలో ఉన్న ఉద్యోగాలు  పోయి కొందరు, ఉద్యోగాలు  దొరక్క మరికొందరు నిరుద్యోగులు  పెరుగుతున్నారు. విదేశాల్లో చదువుతో పాటు కొలువులు  కొట్టొచ్చన్న వారికి కూడా నిరాశే ఎదురయ్యింది. ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌, కరోనా కారణంగా మరో రెండేళ్లపాటు మనదేశంలో ఉన్న యువతకు విదేశాలకు వెళ్లే అవకాశం ఉండక పోవచ్చు. దీనికితోడు విదేశాల్లో ఉద్యోగాలు  కోల్పోయిన వారు కూడా మళ్లీ తిరిగి దేశం చేరుకునే ప్రమాదం ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని దేశంలో అవకాశాలు  సృష్టించే విధంగా పాలకులు  ప్రణాళికలు  సిద్దం చేసుకోవాలి. కొత్తగా ఉద్యోగాలు  లేదా ఉపాధి కల్పించేందుకు ఉన్న రంగాలపై దృష్టి సారించాలి. అందరికి ఐటి కొలువులు  రావు కనుక వ్యవసాయాన్ని సమగ్రంగా అభివృద్ది చేసి దానికి ఐటిని జోడిరచాలి. వ్యవసాయ అనుబంధ రంగాలను, ఫుడ్‌ ప్రాజెసింగ్‌ రంగాలను బాగా ప్రోత్సహించడంతో నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే అవకాశాలను పెంచాలి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఏర్పడ్డ సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేస్తున్న క్రమంలో ఆయా రాష్ట్రాలను విశ్వాసంలోకి తీసుకుని కేంద్రం ప్రణాళికలు  సిద్దం చేయాలి.

ఇప్పటికిప్పుడు కొత్తగా ఉద్యోగాల  కల్పన , విదేశీ పెట్టుబడులను రప్పించడం సాధ్యం కాదు కనుక వ్యవసాయాధారిత పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలి తెలంగాణ ప్రభుత్వం చేసిన ఆలోచన మేరకు వ్యవసాయాన్ని సుసంపన్నం చేయాలి. తెలంగాణలో పంటసాగు,ప్రత్యామ్నాయ విధానం, ప్రత్యామ్నాయ పంట గుర్తింపు, రైతులతో నియంత్రిత పద్ధతిలో సాగు చేయించడం, పండిన పంటలకు మంచి ధరలు  వచ్చేలా చేయడం వంటి అంశాలపై ముఖ్యమంత్రి కెసిఆర్‌ సవిూక్షించారు. రాష్ట్రంలో పంటకు మంచి ధర వచ్చి, రైతులకు మేలు  కలిగేటట్లు చేయాలని సీఎం భావిస్తున్నారు. ఇదే దశలో వ్యవసాయానుబంధ  రంగాలను ప్రోత్సహించాలి. సమగ్ర వ్యవసాయ విధానం అవలంబిస్తే ఉచితంగా ఇస్తున్న నీరు, విద్యుత్  వల్ల  కావాల్సిన పంటలు  పండడమే గాకుండా అనుబంధ రంగాలను ప్రోత్సహిస్తే ఉపాధి అవకాశాలు  భారీగా పెరుగుతాయి. దీంతో నిరుద్యోగులకు ఇది కలసి   రాగలదు. అందరూ ఒకే పంట వేసి నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటలు  వేసే పద్ధతిని అమలు  చేయాలని కెసిఆర్‌ చేసిన సూచనలు  దేశం మొత్తానికి వర్తిస్తాయి.

నిజానికి మన జనాభాకు అనుగుణంగా పంట విధానం ఉండాలి. సమగ్ర వ్యవసాయ విధానం పై రాష్ట్ర స్థాయి వ్యవసాయాధికారులు, నిపుణులు , శాస్త్రవేత్తలతో అనేక సార్లు ముఖ్యమంత్రి చర్చించారు. ఏ పంట ఎంత విస్తీర్ణంలో వేయాలి? పండిన పంటలను అమ్ముకోవడానికి ఎలాంటి వ్యూహం అనుసరించాలి? తదితర అంశాపై అధ్యయనం జరిగింది. తెలంగాణలో వ్యవసాయాభివృద్ధికోసం ప్రభుత్వం అనేక చర్యలు  తీసుకున్నది. ప్రాజెక్టు నిర్మాణం ద్వారా సాగునీటి సమస్య పూర్తిస్థాయి పరిష్కారం అవుతుంది. పండుతున్న పంట దిగుబడులను చూస్తుంటే దేశానికే అన్నం ధాన్యాల రంగాలు  తెలంగాణ అవతరిస్తోంది. తెలంగాణనే తీసుకుంటే రానున్న కాలంలో 90 లక్షల  ఎకరాల్లో ప్రతి ఏటా వరిపంట పండుతుంది. 3.5 కోట్ల టన్ను ధాన్యం వస్తుందని గుర్తించారు. ఇంత ధాన్యాన్ని బియ్యంగా మార్చేందుకు అనుగుణంగా రాష్ట్రంలో రైసు  మిల్లు  సామర్థ్యాన్ని పెంచుకోవాల్సి ఉంది. రైతు పండిచిన పంటకు కనీస మద్దతుధర ఇచ్చి కొను గోలు  చేయడమే కాకుండా, ఆ ముడిసరుకును వినిమయ వస్తువుగా మార్చే బాధ్యతను కూడా చేపట్టాల్సి ఉంది. ప్రాజెక్టు పూర్తిచేయడం, ఉచిత విద్యుత్తు ఇవ్వడం ద్వారా కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చింది.  దానివ్ల అద్భుతమైన దిగుబడి వచ్చిందని లెక్కలే చెబుతున్నాయి. లక్ష టన్నుల  మేర కంది పంట చేతికొచ్చే అవకాశం ఉన్నది. రాష్ట్ర ప్రజ అవసరాకోసం కోటి టన్ను ధాన్యం సరిపోతుందని.. మరో 2.5 కోట్ల టన్ను ధాన్యం మనం అమ్ముకోవాంటే ఇందుకు సమగ్రమైన విధానం ఉండాని కెసిఆర్‌ తన సవిూక్షలో గుర్తించారు. మిగు ధాన్యాన్ని అమ్ముకోవాంటే దానికి డిమాండ్‌ ఉండాలని..  డిమాండ్‌ను మనమే సృష్టించాని కూడా భావిస్తున్నారు.


 అయితే ఉన్న పంటను అమ్ముకోవడానికి కష్టపడే బదులు  డిమాండ్‌ ఉన్న పంటనే పండిరచడం ద్వారా మార్కెట్‌పై పట్టు సాధించవచ్చు. ఇది సాధించాలంటే పంట సాగువిధానం.. ప్రత్యామ్నాయ పంట గుర్తింపు, రైతులతో నియంత్రిత పద్ధతిలో సేద్యం చేయించడం.. దిగు బడికి మంచి ధరలు  వచ్చేలా చేయడం లక్ష్యంగా సమగ్ర వ్యవసాయ విధానం రూప కల్పన జరగాలని సీఎం కేసీఆర్‌ కోరుకుంటున్నారు. అయితే దేశం మొత్తానికి కూడా ఇలాంటి విధానం అవసరం. ఒకటి రాష్ట్రాలుగా ఎవరికి వారు తమ అవసరాల  కోసం కావాల్సిన పంటను పండిరచడం, మార్కెట్‌ డిమాండ్‌ లేదా ప్రపంచ మార్కెట్‌ డిమాండ్‌ మేరకు పంటను పండిరచే అవాటు చేసుకోవాలి. రైతుంతా మూస పద్ధతిలో ఒకే పంటవేసి నష్టపోకుండా, ప్రభుత్వం సూచించిన పంటలే సాగుచేసే నియంత్రిత పద్ధతి రాష్ట్రంలో వచ్చితీరాని వ్యవసాయరంగ నిపుణు, వ్యవసాయాధికాయి అభిప్రాయపడ్డారు. వ్యవసాయ భివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకొన్న చర్యలు  ఫలితమివ్వాంటే పంటలకు మంచిధర రావాలని ఆకాంక్షిం చారు. ఇందుకోసం ఎవరిష్టం వచ్చినట్లు వారు పంట సాగు చేసుకోవడం కాకుండా వ్యవసాయాధికారులు , శాస్త్రవేత్తలు , నిపుణులు  చెప్పినట్లు పంటలు  వేసే విధానం రావాలని స్పష్టం చేశారు. ఇదే కోవలో దేశంలో ఇతర రాష్ట్రాలు  వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయాధికారుల , వ్యవసాయ యూనివర్సిటీలు , పౌర సరఫరాల  సంస్థ సమన్వయంతో వ్యవహరించి  రైతుకు మేలు  కలిగించే వ్యవసాయ విధానాన్ని అమలు  చేసేలా రైతుల్లో చైతన్యం కలిగించాల్సి ఉంది. ఆ మేరకు ఆయా రాష్ట్రాల  సిఎంలు  తెంగాణాలో లాగా సమగ్ర వ్యవసాయ విధానానికి శ్రీకారం చుట్టాలి. అలాగే ఎగుమతును ప్రోత్సహించే పంటను పండిర చేలా చేయాలి. అప్పుడు రైతుకు, వ్యవసాయంపై ఆధారపడ్డ వారికి ఉపాధి దక్కుతుంది. ఈ దిశగా కేంద్రం చొరవ తీసుకుంటే మరింత మంచిది. దీంతో దేశంలో ఉపాధి అవకాశాలు  పెరుగుతాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు